Share News

Elon Musk: జార్జి సోరోస్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:42 PM

ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ప్రీడం అవార్డుకు 19 మంది పేర్లను బైడెన్ ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ శనివారంనాడు ప్రకటించింది. రాజకీయాలు, పరోపకారం, క్రీడలు, కళలు సహా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఆ అవార్డులు ప్రదానం చేస్తుంటారు.

Elon Musk: జార్జి సోరోస్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం

క్రాకో: ప్రపంచ కుబేరుడు, ఫిలాంత్రోపిస్ట్ జార్జి సోరోస్‌ (George Soros)కు అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెండ్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఫైర్ అయ్యారు, సోరోస్‌ను అమెరికా అత్యున్నత పురస్కారంతో సత్కరించడం 'హాస్యాస్పదం' అని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

Donald Trump: ట్రంప్‌కు 10న శిక్ష ప్రకటన


ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ప్రీడం అవార్డుకు 19 మంది పేర్లను బైడెన్ ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ శనివారంనాడు ప్రకటించింది. రాజకీయాలు, పరోపకారం, క్రీడలు, కళలు సహా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఆ అవార్డులు ప్రదానం చేస్తుంటారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిలాంత్రోపిస్ట్‌ సోరోస్‌ను ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, విద్య, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలకు గాను అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలిపింది. ఈ అవార్డుకు ఎంపికైన ఇతర ప్రముఖుల్లో అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, యాక్టర్స్ మైఖేల్ జే ఫాక్స్, డెంజెల్ వాష్టింగ్టన్ తదితరులు ఉన్నారు.


సోరోస్ ఎవరు?

బిలయనీర్ ఇన్వెస్టర్‌గా పేరున్న సోరోస్ వివాదాల్లోనూ తరచు ప్రముఖంగా వినిపిస్తుంటారు. తరచు రిపబ్లికన్ రాజకీయనేతలపై ఆయన విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రజాస్వామ్య సంస్థలు, మానవ హక్కులు, విద్యావకాశాలకు మద్దతుగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా విరాళాలు అందిస్తుంటారు. వీటిపై ముఖ్యంగా కన్జర్వేటివ్ సర్కిల్స్ నుంచి విమర్శలు వస్తుంటాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా అమెరికాలో దాని ప్రభావంపై ఆయన వ్యతిరేకుల నుంచి తరచు విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతుంటాయి. రాజకీయ ప్రచారాలకు ఆయన విరాళాలు ఇవ్వడం ప్రజాస్వామ్య ప్రక్రియను నీరుగారుస్తుందని వీరి అభియోగం. 94 ఏళ్ల జార్జి సోరోస్ ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడారు. దీనిపై స్పందనలు కూడా వెలువడ్డాయి. భారత రాజకీయాల్లో ఆయన జోక్యంపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.


కాగా, సోరోన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంపై మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎంఏజీఏ) మద్దతుదారులు, రిపబ్లికన్ నాయకత్వం సైతం తాజాగా విమర్శలు గుప్పించారు. హంతకుల శిక్షాకాలాన్ని తగ్గించడం, 16 రోజులకే తన కొడుక్కి క్షమాభిక్ష కల్పించడం వంటి సంఘటనల తర్వాత అమెరికా ఖ్యాతిపై విసిరిన మరో పంజా సోరెన్‌కు అవార్డు ప్రకటించడమని రిపబ్లిక్ నేత నిక్కీ హేలీ విమర్శించారు. నేరాలపై మెతకవైఖరి ప్రదర్శించే వ్యక్తులను ఎన్నుకునేందుకు సోరోస్ విరాళాలు ఇవ్వడం వల్ల ప్రధాన నగరాలకు క్రిమినల్స్ బెడద పెరుగుతుందని మోంటనా సెనెటర్ టిమ్ షీహీ 'న్యూయార్క్ పోస్ట్' తో మాట్లాడుతూ చెప్పారు.


అవార్డును సమర్ధించిన బైడెన్

కాగా, అవార్డుల ఎంపికను ప్రెసిడెంట్ బైడెన్ సమర్ధించుకున్నారు. అవార్డుకు ఎంపికైన వారంతా దేశానికి, ప్రపంచానికి గణనీయమైన సేవలందించారని అన్నారు. అమెరికా విలువలకు సమర్ధించిన గొప్ప నేతలని కొనియాడారు.


ఇవి కూడా చదవండి..

Imran Khan: దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం వచ్చినా..

New Virus: చైనాలో మళ్లీ కొత్త రకం వైరస్.. మరో మహమ్మారి రాబోతుందా..

International : 120 కమాండోలు.. 21 జెట్‌లు..3 గంటల్లోనే మిస్సైల్ ప్లాంట్‌ ధ్వంసం..

Read More International News and Latest Telugu News

Updated Date - Jan 05 , 2025 | 04:45 PM