Chinmoy Krishna Das: ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌కు మళ్లీ షాక్.. 11 మంది లాయర్లతో..
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:52 AM
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కోర్టు, 2024 నవంబర్ 25న అరెస్టయిన ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాంటెంప్లేషన్) మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌కు గురువారం బెయిల్‌ను తిరస్కరించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్ (ChinmoyKrishnaDas) బంగ్లాదేశ్‌లో (bangladesh) నెల రోజులకు పైగా జైలులో ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఆయనకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చింది. గురువారం చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ జరిపి ఆయన బెయిల్‌ను తిరస్కరించారు. దీంతో చిన్మయ్ దాస్ మరికొంత కాలం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. బెయిల్ విచారణ సమయంలో 11 మంది న్యాయవాదులతో కూడిన బెంచ్ విచారణలో పాల్గొన్నా కూడా, చిన్మోయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ లభించలేదు.
దీనికి ముందు కూడా..
అంతకుముందు డిసెంబర్ 11న బంగ్లాదేశ్ కోర్టు దాస్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విధానపరమైన లోపాల కారణంగా తిరస్కరించింది. ఇది చాలా బాధాకరమైన వార్త అని కోల్‌కతా ఇస్కాన్ వీపీ రాధా రామన్ అన్నారు. ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తోందన్నారు. కొత్త సంవత్సరంలో చిన్మయ్ ప్రభుకి స్వేచ్ఛ లభిస్తుందని అందరూ ఆశించారని పేర్కొన్నారు. అయితే 42 రోజుల తర్వాత కూడా ఈరోజు విచారణలో ఆయన బెయిల్ తిరస్కరించబడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
కారణమిదేనా..
చిన్మోయ్ కృష్ణ దాస్‌పై బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచినట్లు ఆరోపణలు పెడుతూ దేశద్రోహం కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో ఆయన తరపున న్యాయవాది అపూర్బా కుమార్ భట్టాచార్జీ నేతృత్వంలో బంగ్లాదేశ్ న్యాయవాదులు వాదిస్తున్నారు. 2024 నవంబర్ 25న ఛటోగ్రామ్‌లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేసిన తరువాత, బంగ్లాదేశ్ న్యాయవాదుల బృందం ఈ కేసును విచారిస్తోంది. చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు తరువాత 2024 నవంబర్ 25న చటోగ్రామ్‌లోని న్యాయస్థానం ఆయనపై దేశద్రోహం కేసులో విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నప్పటికీ, ఆయన తరపున న్యాయవాదులు బెయిల్ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
విచారణకు హాజరుకానీ న్యాయవాది
మంగళవారం సాయంత్రం ఛాతీ నొప్పి కారణంగా న్యాయవాది చిన్మోయ్ కృష్ణ దాస్ కార్డియాలజీ విభాగంలో చేరారు. భౌతిక అస్వస్థత కారణంగా జనవరి 2న చిట్టగాంగ్ కోర్టులో దేశద్రోహం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్మోయ్ కృష్ణ విచారణకు ఆయన హాజరుకాలేదు. చిన్మయ్ దాస్ అరెస్టుపై, దాస్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయనపై వచ్చిన ఆరోపణల గురించి ఢాకా పోలీసులు తెలిపారు. చిన్మయ్ దాస్‌పై బీఎన్పీ మాజీ నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఈ ఆరోపణలు చేశారు. అక్టోబర్ 25న చిట్టగాంగ్‌లో హిందూ సంఘాల ర్యాలీ జరిగిందని ఖాన్ ఆరోపించారు. అక్కడే చిన్మోయ్ దాస్, మరో 18 మంది వ్యక్తులు బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారని అన్నారు. అయితే ఆ సమయంలో బీఎన్పీ నేతగా ఉన్న ఫిరోజ్ ఖాన్ పార్టీ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే బీఎన్‌పీ నుంచి బహిష్కరించబడ్డారు.
ఇవి కూడా చదవండి:
Trump Tower: ట్రంప్ టవర్ ముందు బ్లాస్ట్.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News