Share News

Pakistan defence ministers: పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత వివరణతో అంతర్జాతీయ మీడియా షాక్

ABN , Publish Date - May 09 , 2025 | 04:54 PM

భారత డ్రోన్లను అడ్డగించలేదు ఎందుకంటే... మేం కావాలనే అలా చేశామంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఇచ్చిన వింత వివరణతో అంతర్జాతీయ మీడియా షాక్ తింది.

Pakistan defence ministers: పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత వివరణతో అంతర్జాతీయ మీడియా షాక్
Pakistan defence minister Khawaja Muhammad Asif

Pakistan defence minister's bizarre explanation: 'భారత డ్రోన్లను అడ్డగించలేదు ఎందుకంటే...' మేం కావాలనే అలా చేశామంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇచ్చిన వింత వివరణతో అంతర్జాతీయ మీడియా షాక్ తింది. ఎందుకిలా చేయాల్సి వచ్చిందని అడిగితే.. ఒక వేళ తాము వాటిని అడ్డగించుంటే, తమ సైనిక కీలక స్థావరాల వివరాలు భారత్ కు తెలిసిపోయే అవకాశం ఉందని అందుకనే తాము అలా చేశామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొంటె వివరణ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ, తమ సైనిక స్థావరాల ఖచ్చితమైన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా భారత డ్రోన్లను అడ్డగించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనికి ఒక రోజు ముందు అంటే నిన్న, ఆసిఫ్ CNNకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తడబడ్డారు. భారత జెట్‌లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనల గురించి సదరు జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. కూల్చినట్టు చెబుతున్న మీ వాదనలకు 'మీ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయా' అని జర్నలిస్ట్ అడిగినప్పుడు, ఆసిఫ్ సోషల్ మీడియా పోస్ట్‌లను చూపించారు. అవి కాదు.. "మీరు మరిన్ని వివరాలు అందించగలరా? దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి సార్?" అని సదరు జర్నలిస్ట్ అడిగింది. దీనికి ప్రతిస్పందనగా, ఆసిఫ్.. "భారతీయ సోషల్ మీడియాలో, మన సోషల్ మీడియాలో కాదు. ఈ జెట్ల శిథిలాలు పడ్డాయి... అది భారత మీడియాలో అంతా ఉంది." అంటూ వింత వాదన చేశారు. దీంతో పాక్ రక్షణ మంత్రి దెబ్బకు అంతర్జాతీయ ప్రముఖ జర్నలిస్టులు దిక్కులు చూస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు

Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2025 | 04:54 PM