Share News

Putin: భారత్, చైనాపై అమెరికా ఆంక్షల్ని తప్పుబట్టిన పుతిన్

ABN , Publish Date - Sep 04 , 2025 | 10:44 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్, చైనాలకు అండగా నిలిచారు. ఇరు దేశాలపై అమెరికా అవలంబిస్తున్న ట్రేడ్ టారిఫ్స్‌ను‌ పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని..

Putin: భారత్, చైనాపై అమెరికా ఆంక్షల్ని తప్పుబట్టిన పుతిన్
Putin slams

బీజింగ్, సెప్టెంబర్ 4: భారత్, చైనాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండగా నిలిచారు. ఇరు దేశాలపై అమెరికా అవలంబీస్తున్న ట్రేడ్ టారిఫ్స్ ను పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. చైనాలో తన నాలుగు రోజుల పర్యటన తర్వాత పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


దాదాపు 1.5 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశం, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా వంటి దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు.. దీర్ఘకాలంగా ఉన్న ఆయా దేశాల సార్వభౌమాధికారంపై దాడులుగా భావించే అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. వలస రాజ్యాల యుగం ముగిసిందన్న పుతిన్.. భాగస్వాములతో జాగ్రత్తగా మాట్లాడాలని ట్రంప్‌కు హితవు పలికారు.


ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, చివరికి అన్ని విషయాలూ కొలిక్కివస్తాయని పుతిన్ అన్నారు. మళ్లీ ఆయా దేశాల మధ్య సాధారణ పరిస్థితులు చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కేవలం ఓ సాకుగా చూపి టారీఫ్ లతో ట్రంప్ రెచ్చిపోతున్నారని అన్నారు. దీనికి ఉదాహరణగా ఉక్రెయిన్ యుద్ధానికి ప్రత్యక్ష సంబంధం లేని బ్రెజిల్ దేశంపై అమెరికా అదనపు సుంకాలను విధించడాన్నీ పుతిని ఎత్తి చూపారు.

Putin.jpg


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 01:42 PM