Share News

HongKong Plane Crash: హాంకాంగ్‌ రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..

ABN , Publish Date - Oct 20 , 2025 | 10:39 AM

ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హాంకాంగ్‌ చేరుకొన్న ఎమిరేట్స్‌ విమానం నార్త్‌ రన్‌వేపై దిగింది. ఈ నేపథ్యంలో విమానం అదుపుతప్పి.. ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఓ వాహనాన్ని ఢీట్టింది.

HongKong Plane Crash: హాంకాంగ్‌ రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..
HongKong Plane Crash

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత కాలంలో ఎక్కడో ఓ చోట విమాన ప్రమాదాలు తరచూ జరుగుతునే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ విమాన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన హాంకాంగ్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. హాంకాంగ్‌ విమానాశ్రయంలో ఓ భారీ కార్గో విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడింది. దీంతో రన్‌వేపై గ్రౌండ్‌ వెహికల్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది మరణించారు.


ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హాంకాంగ్‌ చేరుకొన్న ఎమిరేట్స్‌ విమానం నార్త్‌ రన్‌వేపై దిగింది. ఈ నేపథ్యంలో విమానం అదుపుతప్పి.. ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఓ వాహనాన్ని ఢీట్టింది. అనంతరం సముద్రంలో పడింది. విమానం దూసుకెళ్తున్న సమయంలో రన్‌వేపై ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరిని సిబ్బంది రక్షించారు. దీంతో ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానాన్ని టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎమిరేట్స్‌ నుంచి లీజుకు తీసుకొని నడుపుతుంది.


ఇవి కూడా చదవండి..

Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు

JEE Main 2026: జేఈఈ మెయిన్‌-2026షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 20 , 2025 | 12:42 PM