Pakistan Blast: పాక్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:20 PM
ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు కారణాలపై ఘటనా స్థలిలో సాక్ష్యాలను అధికారులు సేకరిస్తున్నారు. రైల్వే ట్రాక్ బాగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం.
ఇస్లామాబాద్: బలోచ్ వేర్పాటువాద మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) టార్గెట్‌గా చేసుకుని పట్టాలపై బాంబులు అమర్చి పేల్చివేశారు. దీంతో ఐదు బోగీలు పట్టాలు తప్పి సుమారు ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థాన్ నైరుతి సింధ్ ప్రావిన్స్‌లో మంగళవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు కారణాలను వెలికితీసేందుకు ఘటనా స్థలిలో సాక్ష్యాలను అధికారులు సేకరిస్తున్నారు. రైల్వే ట్రాక్ బాగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం.
మేమే పేల్చేసాం
కాగా, తాజా ఘటన తమ పనేనని బలోచ్ మిలిటెంట్ గ్రూప్ బలోచ్ రిపబ్లికన్ గార్డ్స్ ప్రకటించింది. షికార్‌పూర్-బీఆర్‌జీ ఏరియాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ పేలుడుకు తామే కారణమని, సుల్తాన్ కోట్ వద్ద ఐఈడీని రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశామని బీఆర్‌డీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ ఆర్మీ రైలులో ప్రయాణిస్తోందని, ఈ పేలుడులో పలువురు సైనికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారని, ఆరు బోగీలు పట్టాలు తప్పాయని ఆ ప్రకటన తెలిపింది. ఇండిపెండెంట్ బలోచిస్థాన్ సాకారమయ్యేంత వరకూ ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటామని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్ తన ప్రజల పైనే బాంబులు వేస్తోంది.. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆగ్రహం..
అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి