Share News

BAPS Hindu Temple: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

ABN , Publish Date - Aug 13 , 2025 | 02:44 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇండియాకు వ్యతిరేకంగా ఆలయ ఆవరణలో వేర్పాటువాదులు రాతలు రాసినట్టు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది. హిందూ ఆలయాన్ని అపవిత్రం చేయడం ఏడాదిలో ఇది నాలుగోసారని, ఈసారి గ్రీన్‌వుడ్‌లోని BAPS మందిరంపై దాడి చేశారని తెలిపింది.

BAPS Hindu Temple: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
BAPS Hindu Temple

ఇండియానా: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండియానా రాష్ట్రం గ్రీన్‌వుడ్ సిటీలోని అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ ఆలయం (BAPS Swaminarayan Temple)పై దాడి చేశారు. ఖలిస్థాన్‌కు మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా పలు విద్వేషపూరిత నినాదాలు ఆలయంపై రాసినట్టు హిందూ అమెరికన్ ఫౌండేషన్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇండియాకు వ్యతిరేకంగా ఆలయ ఆవరణలో వేర్పాటువాదులు రాతలు రాసినట్టు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది. హిందూ ఆలయాన్ని అపవిత్రం చేయడం ఏడాదిలో ఇది నాలుగోసారని, ఈసారి గ్రీన్‌వుడ్‌లోని BAPS మందిరంపై దాడి చేశారని తెలిపింది. ఆలయాలపై దాడులు, రాతలు రాయడం అనే వ్యూహం ఖలిస్థాన్ వేర్పాటువాదులు అనుసరిస్తుంటారని, ఈ దాడిని ఖండించడంతో సరిబెట్టుకోకుండా అధికారులు ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


ఈ ఘటనను చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తక్షణ చర్చలు తీసుకోవాలని కోరుతూ అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. కాగా, గత మార్చిలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రసిద్ధ హిందూ దేవాలయంపై కూడా వేర్పాటువాదులు ఇదే తరహా దాడులు జరిగాయి. హిందూ వ్యతిరేక, భారత ప్రభుత్వ వ్యతిరేక రాతలు రాశారు.


భారత్‌కు ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతాం.. పాక్ ప్రధాని హెచ్చరిక

కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. నీళ్లివ్వండి ప్లీజ్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 02:51 PM