Share News

Pak PM Warns India: భారత్‌కు ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతాం.. పాక్ ప్రధాని హెచ్చరిక

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:55 AM

సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాక్ నేతలు తమ నోటికి పని చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై పాక్ ప్రధాని మాట్లాడుతూ భారత్‌కు మర్చిపోలేని విధంగా గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

Pak PM Warns India: భారత్‌కు ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతాం.. పాక్ ప్రధాని హెచ్చరిక
Shehbaz Sharif Indus Waters Threat

ఇంటర్నెట్ డెస్క్: సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో అల్లాడిపోతున్న పాక్ నేతలు ఏం చేయాలో పాలుపోక నోటికి పని చెబుతున్నారు. యుద్ధోన్మాదంతో ఊగిపోతూ పిచ్చి ప్రేలాపనలకు దిగుతున్నారు. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై నోరు పారేసుకున్నారు. భారత్‌కు ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.

‘నీటిని అడ్డుకుంటామంటూ బెదిరింపులకు దిగుతున్న ఈ శత్రువుకు నేను ఒకటే చెబుతున్నా.. మా నీటిలో మీరు ఒక్క చుక్కను కూడా తీసుకోలేరు. నీటిని అడ్డుకుంటున్నామంటూ మీరు బెదిరింపులకు దిగుతున్నారు. కానీ ఇలాంటి పని చేస్తే పాక్ మీకు ఎన్నటికీ మర్చిపోలేని విధంగా గుణపాఠం చెబుతుంది’ అని వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ కామెంట్స్ చేశారు. సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందం పాక్‌కు జీవనాడి అని పాక్ ప్రధాని అన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.


ఇటీవల పాక్ విదేశాంగ శాఖ.. ఒప్పందం అమలును కోరుతూ భారత్‌కు లేఖ రాసింది. ‘సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఎప్పటిలాగే అమలు చేయాలని భారత్‌ను కోరుతున్నాము. ఒప్పందానికి కట్టుబడి బాధ్యతలు నిర్వర్తించాలని కోరుతున్నాము’ అని పాక్ విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా కూడా పోస్టు పెట్టింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మళ్లీ రెచ్చిపోయారు.

ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, మరో నేత బిలావల్ భుట్టో కూడా భారత్‌పై యుద్ధోన్మాదంతో రెచ్చిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. భారత్‌ను ఉద్దేశిస్తూ మునీర్ అణుయుద్ధ హెచ్చరికలు చేశారు. పాక్ ఉనికికి ముప్పు వస్తే తమతో పాటు సగం ప్రపంచం అంతమవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రజలు ఏకం కావాలని బిలావల్ భుట్టో పిలుపునిచ్చారు.


అమెరికా, పాక్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవలి ఇంధన ఒప్పందం తరువాత పాక్ కోరిక మేరకు బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్‌ను అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించింది. దీంతో, పాక్ సంబరాలు చేసుకుంటోంది. అయితే, బలొచిస్థాన్‌లోని సహజవనరులను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే అమెరికా పాక్ విజ్ఞప్తిని అంగీకరించిందని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. బలోచ్ ఆర్మీ మాత్రం పాక్ దళాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి:

ఇలాగైతే భారత్‌పై యుద్ధం మినహా పాక్‌కు మరో మార్గం ఉండదు: బిలావల్ భుట్టో హెచ్చరిక

ట్రంప్ టారిఫ్‌ల బాణం.. వచ్చే నెల అమెరికాకు మోదీ!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 12:04 PM