Winter Season: చలికాలంలో ఈ పనులు అస్సలు చేయొద్దు.. ఎంటో తెలుసా?
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:24 AM
చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల రోగాలు వెంటబెట్టుకు వస్తుంది. ఈ సీజన్‌లో వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది.
చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఎక్కువగా రోగాల భారిన పడుతుంటారు. చాలా మంది కొన్ని తెలియకుండా చేసే తప్పిదాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మీ ఆరోగ్యం, జీవనశైలిపై మంచి ప్రభావం చూపిస్తాయి.
1. ఉదయం నిద్ర లేవగానే వేడి పడకలో నుండి నేరుగా బయటి చలి వాతావరణంలోకి వెళ్లకూడదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయి గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే కొద్దిసేపటి వరకు గదిలోనే ఉండి.. స్వెట్టర్లు లేదా వెచ్చని దుస్తులు కప్పుకొని బయటికి రావాలి.
2. శీతా కాలంలో చలితో పాటు, వెలుతురు తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వారికి వింటర్ సీజన్ లో చాలా సమస్యలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు తగ్గినపుడు రక్తంలోని చక్కెర పెరుగుతుంది. సాధ్యమైనంత డయాబెటీస్ ఉన్నవాళ్లు వ్యాయామం, యోగా వంటివి చేస్తే షుగర్‌ని కంట్రోల్ చేయొవొచ్చని నిపుణులు చెబుతున్నారు.
3. చాలామంది చలికాలంలో వేడి వేడిగా కాఫీ, టీలు తాగుతుంటారు.వీటిలో ఉండే కెఫీన్ వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పులతో గుడ్ బై చెబితే బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు.
4. చలికాలంలో చర్మం పొడిబారినపుడు మాత్రమే క్రీములు రాస్తుంటారు. అయితే, చర్మం తేమగా ఉన్నపుడు మాయిశ్చరైజర్ రాస్తే చాలా మంచింది. పెదవులు ఆరిపోతున్నాయని పదే పదే నాలుకతో తడిపితే చాలా డేంజర్. దీనివల్ల పెదవులు మరింత పగులుతాయి. లిప్ బాంబ్, వ్యాసిలిన్ వాడితే మంచిది.
5. శీతాకాలంలో చాలా మంది ఇల్లు వెచ్చగా ఉంటుందని తలుపులు, కిటికీలు మూసివేస్తారు. కొంతమంది బొగ్గు, రూమ్ హీటర్లు ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఎంతో ప్రమాదం, గదిలో కార్బన్ మొనాక్సైడ్ పెరిగి ఊపిరి ఆడకపోవడం, కొన్నిసార్లు ప్రాణపాయం కూడా జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
6. చలికాలం సాధ్యమైనంత వరకు త్వరగా భోజనం చేయడం మంచిది. ఆలస్యంగా తింటే జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. పడుకోవడానికి ముందు కనీసం రెండు గంట ముందు భోజనం చేయడం మంచిది.
7. వింటర్ సీజన్ లో ఐస్ క్రీమ్స్, చల్లని పానియాల జోలికి వెళ్లకపోవడం ఎంతో శ్రేయస్కరం. వీటి వల్ల గొంగ ఇన్ఫెక్షన్లు(Sore Throat), టాన్సిల్స్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. సాధ్యమైనంత వరకు వేడి పదార్థాలు తీసుకుంటే మంచిదని అంటున్నారు నిపుణులు
8. శీతాకాలంలో చాలా వరకు బయట ఫుడ్ మానేస్తే మంచిదంటున్నారు. ముఖ్యంగా బయట దొరికే వేపుడు (Fries), జంక్ ఫుడ్ అతిగా తింటే బరువు పెరగడంతో పాటు జీర్ణక్రియ మందగించి రక రకాల ఇబ్బందులు వస్తాయి. బద్దకం పెరిగిపోతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )