Mouth Ulcer: నోటి పూత ఎందుకొస్తుంది? తగ్గేందుకు ఏం చేయాలి?
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:16 PM
Mouth Ulcer Prevention: కొంతమందిని తరచూ నోటి పూత సమస్య వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఈ సమస్య పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇంతకీ, నోటి పూత వెనుక కారణాలు ఏమిటి? దీన్ని నయం చేయడానికి పాటించాల్సిన సహజ చిట్కాలేవో తెలుసుకుందాం..
Mouth Ulcer Home Remedies: వేసవిలో తరచుగా నోటి పూత సమస్య తలెత్తే అవకాశముంది. కానీ, ఇతర కాలాల్లోనూ కొందరిలో ఈ సమస్య కనిపిస్తూనే ఉంటుంది. నోటిపూత వస్తే సరిగా తినలేరు, తాగలేరు. ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు నోటిని కదిలించేందుకు, మాట్లాడేందుకూ ఇబ్బందిగా ఉంటుంది. మందులు వేసుకున్నా కొన్నిసార్లు ఈ సమస్య పోదు. కడుపులో సమస్యలు ఉంటేనే ఇలా జరుగుతుందని వైద్యులు అంటున్నారు. జీర్ణవ్యవస్థలో సమస్యలు లేదా అధిక ఆమ్లతత్వం వల్ల నోటి పూత వచ్చే అవకాశం ఉంటుంది చెబుతున్నారు.
నోటిపూత ఎందుకొస్తుంది?
నోటి పూత సమస్య అన్ని వయసుల వారిలో తరచుగా చూస్తూనే ఉంటాం. తినడంలో అజాగ్రత్త కారణంగానే ఈ సమస్య వస్తుంది. కడుపులో సమస్య ఉన్నప్పుడు కూడా నోటి పూత వస్తుంది. ఈ పూతలు బుగ్గ, పెదవులు, నాలుక లేదా గొంతు లోపలి చర్మంపైనా రావచ్చు. నోటి పూత తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఆహారం తినడం కష్టంగా మారుతుంది. ఆయుర్వేదం ప్రకారం, జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు కడుపులో వేడి ఉంటుంది. దీని కారణంగా నోటి పూతలు వస్తాయి.
కారణాలివే..
కడుపులో వేడి కారణంగా తరచుగా నోటిలో పుండ్లు వస్తాయి. ఈ పుండ్లు నొప్పిని కలిగిస్తాయి. దీని కారణంగా తినడానికి, మాట్లాడటానికి ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు ఈ పుండ్లు నాలుకపై వస్తాయి. ఎర్రటి చిన్న పుండ్లు కనిపిస్తాయి. గొంతులోని పుండ్లు అత్యంత ఇబ్బందికరమైనవి. కడుపులో ఎక్కువ ఆమ్లం ఏర్పడినప్పుడు అది తిరిగి నోటిలోకి వచ్చి పూతలకు కారణమవుతుంది. కడుపులో వేడితోపాటు విటమిన్ లోపం, ఒత్తిడి, ఇన్ఫెక్షన్, ఇతర ఆరోగ్య సమస్యలూ నోటి పూతకు కారణమవుతాయి. నోటి పూతను నయం చేయడానికి కొన్ని సులభమైన ఇంటి నివారణలు ఉన్నాయి.
ఈ పద్ధతుల ద్వారా నయం చేయవచ్చు..
నోటి పూత వచ్చినప్పుడు పటిక నీటితో పుక్కిలించాలి. ఇది పూతల నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుంది. దీనితోపాటు పెరుగు, తేనె, పసుపు, త్రిఫల, తులసి ఆకులు, ఏలకులు, సోంపు, చక్కెర సిరప్, కొత్తిమీర, లికోరైస్ కూడా ఉపయోగించవచ్చు. ఇవి నోటి పూత నుంచి త్వరగా ఉపశమనం ఇస్తాయి. ఈ పదార్థాలు కడుపులోని వేడినీ శాంతపరుస్తాయి.
NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.
ఇవి కూడా చదవండి:
వయసు పెరిగే కొద్దీ పొట్ట, నడుముపై కొవ్వు పేరుకుపోవడానికి కారణాలు.. పరిష్కారాలు..
నేరేడు పండ్లను ఇలా తింటే సైడ్ ఎఫెక్ట్స్..!