Health Benefits on Papay Leafs: బొప్పాయి ఆకు జ్యూస్‌తో.. ఈ సమస్యలు దూరం..
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:33 PM
చాలా మంది చాలా రకాల జ్యూస్ తాగుతారు. అది బలం కోసం లేకుంటే రుచి కోసం తాగుతారు. అయితే మరికొంత మంది అనారోగ్య సమస్యలతోపాటు పలు వ్యాధులు నయం చేసుకోవడానికి మరికొన్ని రకాల జ్యూస్ తాగుతారు.
చాలా మంది చాలా రకాల జ్యూస్ తాగుతారు. అది బలం కోసం లేకుంటే రుచి కోసం తాగుతారు. అయితే మరికొంత మంది అనారోగ్య సమస్యలతోపాటు పలు వ్యాధులు నయం చేసుకోవడానికి మరికొన్ని రకాల జ్యూస్ తాగుతారు. అందులో ఒకటి బొప్పాయి ఆకుల జ్యూస్. ఇది కాలేయాన్ని రక్షించడం, చర్మ వ్యాధులను నివారించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా జీర్ణక్రియను సైతం సమతుల్యం చేస్తోంది.
బొప్పాయి కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి అద్భుతమై ఔషధ గుణాలు కలిగిన పండు అని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఆయుర్వేదంలో బొప్పాయి పండు, దాని ఆకులు, గింజలు సైతం అనేక వ్యాధులకు చికిత్సగా వినియోగిస్తారు.
ప్రతి రోజు కొద్ది మొత్తంలో బొప్పాయి రసం తాగడం వల్ల శరీరంలోని విషం తొలుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడానికి సహాయపడుతుంది. బొప్పాయి ఆకులను నీటిలో మరిగించి.. టీగా చేసుకు తాగడం ఇంకా మంచిదని అంటున్నారు. ఈ నీరు శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బలాన్ని ఇస్తుంది.
బొప్పాయి ఆకుల్లో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే.. వాటిలోని సహజ పదార్థాలు శరీరాన్ని వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థగా పని చేస్తాయి. మరి ముఖ్యంగా చర్మ వ్యాధుల చికిత్సలో ఈ ఆకులు బాగా పని చేస్తాయి.
బొప్పాయి ఆకుల నుంచి తీసిన నూనె చర్మానికి రాసుకోవడం వల్ల మచ్చలు, మొటిమల మచ్చలు, దురద వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇక ఈ ఆకులను శనగపిండి, తేనేతో కలిసి ముఖానికి రాసుకుంటే చర్మం సహజంగా మెరుస్తుంది.
అలాగే కళ్ల చుట్టు నల్లని వలయాలు తగ్గి.. ఛాయ పెరుగుతోంది. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లితో కలిపి బొప్పాయి ఆకులను చెట్నీగా చేసుకుని తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో బరువు పెరగడంతోపాటు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆకు తీసుకోవడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం నుండి చర్మాన్ని ప్రకాశవంతం చేయడం వరకు, బొప్పాయి ఆకులను ఆయుర్వేదంలో అద్భుతమైన అనారోగ్య నివారణగా పరిగణిస్తారు. రసంగా తాగినా, టీగా కాచినా, పేస్ట్‌గా పూసినా లేదా వంటలో ఉపయోగించినా, అవి మానవ శరీరానికి అన్ని విధాలుగా ఉపశమనం కలిగిస్తాయి. అందుకే బొప్పాయి ఆకులు.. ఆరోగ్యంతోపాటు అందానికి నిధిగా పరిగణిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిల్లల కంటి ఆరోగ్యానికి ఏ ఆహారం ఇవ్వాలి..
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..