Share News

Normal Birth Benefits: సాధారణ ప్రసవంతో బిడ్డకు రక్ష

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:24 AM

సాధారణ ప్రసవంలో పుట్టిన పిల్లలు తల్లి నుంచి సహజమైన బ్యాక్టీరియాను పొందుతూ మంచి రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. సి సెక్షన్‌ ద్వారా పుట్టిన పిల్లలపై దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి

Normal Birth Benefits: సాధారణ ప్రసవంతో  బిడ్డకు రక్ష

పిల్లల ఆరోగ్యం

భారతదేశంలో ఐదో వంతు ప్రసవాలు సి సెక్షన్‌ ద్వారానే జరుగుతున్నాయి. నేషనల్‌ ఫ్యామిలీ సర్వేలో వెల్లడైన గణాంకాల ప్రకారం మన దేశంలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సి సెక్షన్లు 40.6 శాతం నుంచి 47.4 శాతానికి పెరిగాయి. అయితే సాధారణ ప్రసవం, సి సెక్షన్‌ ప్రసవాల్లో పుట్టిన పిల్లల పోషకావసరాలు ఒకేలా ఉంటాయని చాలా మంది తల్లితండ్రులు భావిస్తూ ఉంటారు. కానీ ఇది నిజం కాదని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. పిల్లల పేగుల్లోని బ్యాక్టీరియా, వ్యాధినిరోధక వ్యవస్థలు, దీర్ఘకాలికి ఆరోగ్యాలు వాళ్లు పుట్టిన తీరు మీదే ఆధారపడతాయి. సాధారణ ప్రసవంలో పుట్టిన పిల్లలు తల్లి బర్త్‌ కెనాల్‌ నుంచి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పొందుతారు. ఈ రకమైన ప్రసవం పేగుల్లోని బ్యాక్టీరియాను ప్రభావితం చేస్తుంది. కానీ సి సెక్షన్‌లో పుట్టిన పిల్లలు ఈ బ్యాక్టీరియాను పొందకపోగా, ఆస్పత్రి పర్యావరణం, తల్లి చర్మాల నుంచి మొట్టమొదటి మైక్రోబ్స్‌ను స్వీకరిస్తారు.


సూక్ష్మజీవులకు బహిర్గతమవడంలో ఉన్న ఈ వ్యత్యాసాలు పిల్లల వ్యాధినిరోధక అభివృద్ధినీ, పేగుల ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. సిజేరియన్‌తో పుట్టిన పిల్లల పేగుల బ్యాక్టీరియాలోని అవకతవకల వల్ల, ఈ పిల్లలు తేలికగా అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. దీర్ఘకాలంలో ఒబేసిటీ, టైప్‌1, టైప్‌2 మధుమేహాలు, నాడీసంబంధ రుగ్మతలు, ఆటిజం ముప్పు కూడా ఈ పిల్లలకు పొంచి ఉంటుంది. అయితే సాధారణ ప్రసవంలో పుట్టిన పిల్లల్లా ఈ పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యాన్ని పొందాలంటే, ఘనాహారాన్ని పరిచయం చేసే తొలి రోజుల నుంచి ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని పిల్లలకు అందించాలి.


ఇవి కూడా చదవండి:

బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..

ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

Read Latest and Health News

Updated Date - Apr 22 , 2025 | 01:24 AM