Share News

Hemorrhoids: బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..

ABN , Publish Date - Apr 20 , 2025 | 08:24 PM

బాత్‌రూమ్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ గడిపేవారికి పైల్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఓ డాక్టర్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Hemorrhoids: బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..
Toilet Phone Scrolling Hemorrhoids

ఇంటర్నెట్ డెస్క్: బాత్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఫోన్ వినియోగించడం అలవాటుగా మారిన వారికి ఓ హెచ్చరిక. ముఖ్యంగా మలవిసర్జన సమయంలో కమ్మోడ్‌పై కూర్చుని ఫోన్‌ చూస్తూ ఎక్కువ సేపు ఉండిపోయేవారికి పైల్స్ (హెమరాయిడ్స్) వచ్చే ముప్పు పెరుగుతుందని డా.కునాల్ సూద్ అనే అసస్థిషియాలజిస్టు హెచ్చరించారు. ఎక్కువ సేపు కమ్మోడ్‌పై ఉంటే మలద్వారం లోపలి భాగాలపై ఒత్తిడి పెరిగి రక్త నాళాలు వాచి పైల్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ మేరకు ఆయన చేసిన సూచన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఏమిటీ హెమరాయిడ్స్..

సాధారణ ప్రజానీకానికి తెలిసిన పైల్స్ వ్యాధిని వైద్య పరిభాషలో హెమరాయిడ్స్ అని పిలుస్తారు. మలద్వారం, దాని ఎగువన ఉన్న రెక్టమ్‌ అనే భాగంలో రక్త నాళాలు వాచడాన్నే పైల్స్ అని అంటారు. ఇది కూడా వెరికోస్ వెయిన్స్ లాంటిదేనని వైద్యులు చెబుతున్నారు. రెక్టమ్‌ అంతర్గతంగా ఉన్న రక్తనాళాలు ఉబ్బితే దాన్ని ఇంటర్నల్ హెమరాయిడ్స్ వచ్చాయని అంటారు. మలద్వారం చుట్టు ఉన్న చర్మంలోని రక్త నాళాలు ఉబ్బినప్పుడు ఎక్స్‌టర్నల్ హెమరాయిడ్స్ అని అంటారు. మలవిసర్జన సమయంలో రక్త స్రావం జరుగుతూ వారం దాటినా పరిస్థితి మెరుగు పడలేదంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అయితే, మలద్వారం ద్వారా రక్త స్రావం అయిన ప్రతిసారీ హెమరాయిడ్స్‌గా భావించొద్దని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇందు కోలోరెక్టల్, యానల్ క్యాన్సర్ కూడా కారణం కావొచ్చని అంటున్నారు. కాబట్టి, ఈ పరిస్థితి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


పైల్స్ బారిన పడకుండా ఉండాలంటే..

డా. కునాల్ సూద్ చేసిన సూచనల ప్రకారం, పైల్స్ బారిన పడకుండా ఉండేందుకు బాత్‌రూమ్‌‌లో 10 నుంచి 15 నిమిషాలకు మించి ఉండొద్దు.

మలవిసర్జన సరిగా జరగని పక్షంలో ముక్కేందుకు ప్రయత్నించొద్దు. ఆహారంలో మార్పులు లేదా స్టూల్ సాఫ్ట్‌నర్స్‌ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాలి.

కమోడ్‌పై ఉన్నప్పుడు కాళ్ల కింద చిన్న స్టూ్ల్ పెట్టుకుని కూర్చుంటే పేగుల కదలికలు పెరిగి మలవిసర్జన సులువవుతుంది

పీచుపదార్థం అధికంగా ఉన్న ఆహారం తినడం, నీరు ఎక్కువగా తాగడం వంటివాటితో పేగుల కదలికలు పెరిగి మలబద్ధకం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

Read Latest and Health News

Updated Date - Apr 20 , 2025 | 08:34 PM