Simple Relief For Migraine: మైగ్రేన్‌ను దూరం చేసే సింపుల్ సెవన్ చిట్కాలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:25 PM
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మైగ్రేన్ సమస్య ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు పలు సింపుల్ చిట్కాలు ఇవిగో.. పైసా ఖర్చు లేని చిట్కాలు..
మైగ్రేన్ సమస్య ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఎప్పుడో అప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే కొద్దిపాటి నియమాలు పాటించడం వల్ల.. ఈ సమస్యను అధిగమించవచ్చు. శరీరానికి శక్తిని ఇవ్వడం, పని సామర్థ్యంతోపాటు ఏకాగ్రత వల్ల ఈ సమస్యను దూరం చేయవచ్చు. అదీకాక.. కార్యాలయంలో పని చేసేటప్పుడు లైటింగ్ వల్ల.. ఒక సమయం అంటూ లేకుండా ఆహారం తీసుకోవడంవల్ల.. డీ హైడ్రేషన్‌తోపాటు ప్రాసెసింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ మైగ్రేన్ సమస్య వస్తుంది.
ఒకే సమయానికి భోజనం చేయాలి..
ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయానికి భోజనం చేయాలి. అలా కాకుండా వేళా పాళా లేకుండా భోజనం చేయడం వల్ల రక్తంలోని షుగర్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పాడతాయి. ఇది తలనొప్పికి దారి తీస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది మైగ్రేన్ సమస్యను నివారిస్తోంది.
కెఫిన్ అధికమైతే..
కెఫిన్ పరిమిత స్థాయిలో తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. కానీ అదే అధికంగా తీసుకుంటే మాత్రం.. మైగ్రేన్ వచ్చే అవకాశాలు అధికం. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్ సైతం అధికమయ్యే సూచనలున్నాయి.
ఈ లోపం వల్ల కూడా..
మెగ్నీషియం లోపం వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నట్స్, సీడ్స్, పాలకూర, అవకాడో వంటివి తరచూ ఆహారంలో తీసుకోవాలి. తద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు.
తగినంత నీరు తాగకున్నా..
సరిపడినంత నీరు తాగక పోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. తరచూ మంచి నీరు తాగుతూ ఉండాలి. పని ప్రదేశాల్లో ఉంటే.. ఒక వాటర్ బాటిల్‌ను తప్పని సరిగా పక్కన పెట్టుకోవాలి. శరీరానికి తగిన మోతాదులో నీరు అందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హెర్బల్ టీ లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తగినంత నీరు అందుతుంది.
ఫ్లోరోసెంట్ కాంతుల వల్ల..
కఠినమైన ఫ్లోరోసెంట్ లైటింగ్, స్క్రీన్ గ్లేర్ వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. సాధ్యమైనంత వరకు పరిసరాల్లో సహజ కాంతి ఉండేలా చూసుకోవాలి. ఆ క్రమంలో డెస్క్ ల్యాంప్‌ను వినియోగించాలి. గ్లేర్‌ను తగ్గించే స్క్రీన్‌ను వినియోగించడం శ్రేయస్కరం.
ఇక కార్యాలయంలో అధిక సమయం పని చేయాల్సి ఉంటుంది. మీ గదిలో లైటింగ్‌కు సరిపోయేలా మీ మానిటర్‌ను సరి చేసుకోవాలి. దీంతో కంటి మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆ క్రమంలో యాంటీ గ్లేర్ స్క్రీన్ ప్రొటెక్టర్, బ్లూ లైట్ ఫిల్టరింగ్ గ్లాసెస్ అయితే ప్రయోజనకరంగా ఉంటాయి.
20 - 20 - 20 నియమం..
ఇక గంటల తరబడి కంప్యూటర్ల స్క్రీన్‌ను చూడడం వల్ల కళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దీంతో మైగ్రేన్ తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో 20 -20 - 20 నియమాన్ని పాటించాలి. అంటే.. ప్రతి 20 నిమిషాలకు.. 20 అడుగులు దూరంలో ఉన్న దాని దేనినైనా 20 సెకన్ల పాటు చూడాలి. దీంతో కంటి కండరాలు సడలించడానికి.. ఒత్తిడిని తగ్గించడానికి సహాయ పడుతుంది. తద్వార మైగ్రేన్ సమస్య దూరమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మందులను ఎలా గుర్తించాలి? పూర్తి వివరాలు మీ కోసం!
మరిన్ని ఆరోగ్య వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..