Knuckle cracking cause Arthritis : మీకు వేళ్లు విరుచుకునే అలవాటుందా.. ఈ వ్యాధి వచ్చే అవకాశం..!
ABN , Publish Date - Feb 03 , 2025 | 02:30 PM
వేళ్లు విరుచుకునే అలవాటు దాదాపు చాలామందిలో ఉంటుంది. రిలీఫ్‌గా, సరదాగా అనిపిస్తుందని ఇలా చేయడం సహజంగా చూస్తూనే ఉంటాం. అయితే, ఈ అలవాటు ఉన్న వారిలో ఇలాంటివారికి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. .

ఏం తోచనప్పుడు, విసుగ్గా అనిపించినా, సరదా కోసమో వేళ్లు విరుచుకోవడం చాలా మందిలో కనిపించే అలవాటు. కొంతమందికి అలా చేసినప్పుడు పుట్టే శబ్దం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకని పదే పదే విరుచుకుంటూ ఉంటారు. అయితే, ఈ సాధారణమైన చర్య ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సహజంగా చేసే ఈ పనుల వల్ల ఏదైనా ముప్పు ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఒక ఇంటర్నేషనల్ ఆర్థరైటిస్ సెంటర్ పూనుకుంది. వీరి పరిశోధనలో తేలిన విషయాలివే..
వేళ్లు విరుచుకుంటే ఏమవుతుంది?
కీళ్ల చుట్టూ సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవం ఉంటుంది. వేళ్లు విరుచుకునేటప్పుడు ఒత్తిడి కారణంగా ఈ ద్రవంలోని గ్యాస్ బుడగలు పగులుతాయి. ఈ చర్య ఫలితంగా టప్‌మనే శబ్దం వెలువడుతుంది. అయితే, పదే పదే వేళ్లు విరుచుకుంటే ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదముందా? దీనిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయి. ఈ ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
పిడికిళ్లు బిగించి పదే పదే విరుచుకున్నప్పుడు గ్యాస్ బుడుగలు పగిలి పాపింగ్ సౌండ్ వస్తుంది. రోజులో ఎక్కువ సార్లు ఇలా చేయడం ఆర్థరైటిస్‌కు దారితీయకపోవచ్చు. కానీ వేళ్లల్లో పటుత్వం తగ్గి కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు మెండు. దీర్ఘకాలికంగా ఈ అలవాటు చేతి కదలికలను దెబ్బతీయవచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు, అసౌకర్యాన్ని తగ్గించుకునేందుకు మాటిమాటికీ ఈ చర్య చేయడం మానుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా చేయడం పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చని అధ్యయనాల్లో తేలిన విషయం.
ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది?
ఆర్థరైటిస్ అనేది ఒక సంక్లిష్టమైన వ్యాధి, ఇది కీళ్లలో వాపు, నొప్పి, దృఢత్వాన్ని తగ్గిస్తుంది. ఇందులో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ సంభవిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్ వంటివి ఇప్పుడు అన్ని వయసుల వారిలో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.
పెరుగుతున్న వయస్సు: పెరుగుతున్న వయస్సుతో పాటు కీళ్లలోని మృదులాస్థి (కుషన్డ్ టిష్యూ) అరిగిపోవడం సాధారణం. ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది.
జన్యుపరంగా: మీలో ఎవరికైనా ఆర్థరైటిస్ ఉంటే తర్వాతి తరంలో వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
భారీ శరీరం: అధిక బరువు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగి ఆర్థరైటిస్‌కు కారణమవుతుంది.
రోగనిరోధక వ్యవస్థ: శరీరంలోని రోగనిరోధక శక్తి స్వంత కీళ్లపై దాడి చేసినప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది.
గాయాలు, ఇన్ఫెక్షన్లు: పాత గాయాలు లేదా కీళ్లలో ఇన్ఫెక్షన్లు కూడా ఈ సమస్యను కలిగిస్తాయి.
ఎలా నివారించాలి?
కీళ్లనొప్పులను నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. దీని తరువాత ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. అవసరమైనప్పుడు నిపుణుల సలహా కూడా చాలా ముఖ్యం