Share News

Kidney cancer: ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..

ABN , Publish Date - Aug 17 , 2025 | 10:17 AM

కిడ్నీ కేన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Kidney cancer: ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..
Kidney cancer early symptoms

కిడ్నీ కేన్సర్ (Kidney cancer) అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ కిడ్నీ కేన్సర్‌కు సంబంధించి ఐదు ముందస్తు సూచనల గురించి తెలుసుకుందాం (Kidney cancer early symptoms).


1) మూత్రంలో రక్తం

కిడ్నీ కేన్సర్ మొదటి సంకేతం మూత్రంలో రక్తం పడడం. దీనిని హెమటూరియా అంటారు. కేన్సర్ కణితులు మూత్రపిండాలు, మూత్ర వ్యవస్థలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీయడం వల్ల మూత్రంలో రక్తం పడుతుంది.

2)వెన్ను నొప్పి

మూత్రపిండాల కేన్సర్ నిరంతర పార్శ్వ నొప్పిని లేదా నడుము నొప్పిని కలిగిస్తుంది. ఎటువంటి గాయం లేకుండా వీపు దిగువ భాగంలో నొప్పి మొదలై క్రమంగా తీవ్రమవుతుంది. రక్తంలో మూత్రం పడడం, తీవ్రమైన వెన్ను నొప్పిని విస్మరించకూడదు. వెంటనే చికిత్స ప్రారంభించాలి.


3)బరువు తగ్గడం

వ్యాయామం, డైటింగ్ వంటి లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోనప్పటికీ వేగంగా బరువు తగ్గుతుండడాన్ని కూడా అనుమానించాలి. కిడ్నీ కేన్సర్ ప్రారంభ దశలో ఆకలి, జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గిపోతారు.

4)నడుముకు దిగువన గడ్డలు

నడుము దిగువన లేదా పక్కటెముకల కింద ఏవైనా గడ్డలు లేదా వాపు వంటివి కనిపిస్తున్నా అనుమానించాలి. వీపు దిగువన వాపు అనేది కిడ్నీలో కణితి పెరుగుదలను సూచిస్తుంది. అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షల ద్వారా వైద్యులు ఆ గడ్డలు దేనికి సంబంధించినవో తెలుసుకుంటారు.

5)అలసట, నీరసం

తరచుగా నీరసంగా అనిపించడం, త్వరగా అలసిపోవడం కూడా కిడ్నీ కేన్సర్‌కు ప్రారంభ సంకేతంగా భావించవచ్చు. కిడ్నీ కేన్సర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అది రక్తహీనతకు దారి తీసి తీవ్ర అలసటకు, నీరసానికి కారణమవుతుంది.


ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 10:17 AM