Share News

Medications: మార్కెట్లోకి నకిలీ మందులు..

ABN , Publish Date - Jun 20 , 2025 | 10:47 AM

ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు గురువారం కోఠిలోని ఇందర్‌బాగ్‌లోని ఓ ఫార్మసీలో దాడులు నిర్వహించి రూ.10 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌, శ్రీ నందిని ఫార్మా డీలర్ల వద్ద నకిలీ నిల్వలను గుర్తించారు.

Medications: మార్కెట్లోకి నకిలీ మందులు..

- అధికారుల దాడుల్లో వెలుగులోకి..

హైదరాబాద్‌ సిటీ: ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు గురువారం కోఠి(Kothi)లోని ఇందర్‌బాగ్‌లోని ఓ ఫార్మసీలో దాడులు నిర్వహించి రూ.10 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌, శ్రీ నందిని ఫార్మా డీలర్ల వద్ద నకిలీ నిల్వలను గుర్తించారు. మార్కెట్లో చలామణిలో ఉన్న ‘రోసువాస్‌ ఎఫ్‌ 20, ‘రోసువాస్‌ ఎఫ్‌ 10‘ టాబ్లెట్లు నకిలీవని నిర్ధారించారు.


city7.2.jpg

మేడ్చల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి. శ్రీనివాసులు, గోషామహల్‌ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. అజయ్‌, గండిమైసమ్మ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజా రెడ్డి, కామారెడ్డి డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. మురళీ కృష్ణ(Kamareddy Drugs Inspector K. Murali Krishna) ఈ దాడుల్లో పాల్గొన్నారు. విచారణ అనంతరం నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ షహనాజ్‌ ఖాసీం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పాడు బుద్ధి.. పోయే కాలం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 20 , 2025 | 10:48 AM