Share News

Gold Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ABN , Publish Date - Jun 20 , 2025 | 06:56 AM

భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నడుమ బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నేడు కూడా బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

Gold Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Gold Rate Today On June 20

ఇంటర్నెట్ డెస్క్: భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వాణిజ్య యుద్ధాల నడుమ బంగారానికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటివరకూ 30 శాతం మేర పెరిగాయి. ఇక నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరల్లో (Gold Rate Today On June 20) స్వల్ప పెరుగుదల నమోదైంది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయానికి దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్‌ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ. 1,01,080కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92660గా ఉంది. ఇక 18 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.75820గా ఉంది. కిలో వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.100 మేర పెరిగి రూ.1,12,100కు చేరుకుంది. పది గ్రాముల ప్లాటినం ధర రూ.37,340గా ఉంది.


వివిధ నగరాల్లోని 10 గ్రాముల బంగారం (24కే,22కే,18కే) ధరలు ఇలా

  • చెన్నై: రూ.1,01,090; రూ.92,660; రూ.76,260

  • ముంబై: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820

  • ఢిల్లీ: రూ.1,01,220; రూ.92,810; రూ.75,940

  • కోల్‌కతా: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820

  • బెంగళూరు: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820

  • హైదరాబాద్: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820

  • కేరళ: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820

  • పుణె: రూ.1,01,090; రూ.92,660; రూ.75,820

  • వడోదరా: రూ.1,00,980; రూ.92,710; రూ.75,860

  • అహ్మదాబాద్: రూ.1,00,980; రూ.92,710; రూ.75,860


వివిధ నగరాల్లో వెండి రేట్లు

  • ముంబై: రూ.1,12,100

  • ఢిల్లీ: రూ.1,12,100

  • కోల్‌కతా: రూ.1,12,100

  • బెంగళూరు: రూ.1,12,100

  • హైదరాబాద్: రూ.1,22,100

  • కేరళ: రూ.1,22,100

  • పుణె: రూ.1,12,100

  • వడోదరా: రూ.1,12,100

  • అహ్మదాబాద్: రూ.1,12,100

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3,371.15 డాలర్లుగా ఉంది. అయితే, రాబోయే రెండు నెలల్లో ధరలు 8 నుంచి 10 శాతం మేర కరెక్షన్‌కు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏడాదిలోపు ధర 2800 డాలర్లకు పడిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. భౌగోళిక అనిశ్చితులు మరింత సడలిస్తే ధర 2,400 డాలర్ల దిగువకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి పసిడి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 20 , 2025 | 07:05 AM