Share News

Health Tips : ఈ పదార్థాలను తేనెతో కలిపి అస్సలు తినకండి.. చాలా డేంజర్..

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:15 PM

రుచిలో, పోషకాల్లో అద్భుతమైన పదార్థాల్లో తేనె ఒకటి. ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడంలో, జీర్ణక్రియలో అనేక విధాలా సాయపడుతుందని ఎక్కువ మందిని వాడుతుంటారు. అయితే, తేనెను ఈ పదార్థాలతో తింటే చాలా హానికరం. అవేంటో తెలుసుకుందాం..

Health Tips : ఈ పదార్థాలను తేనెతో కలిపి అస్సలు తినకండి.. చాలా డేంజర్..
honey benefits

తేనె శరీరానికి చాలా ప్రయోజనకరమైనది. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైములు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. తేనెలోని సహజ చక్కెరలు డయాబెటిస్ ఉన్నవారికైతే ఒక రకంగా వరమే. ఇంకా ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడంలో, జీర్ణక్రియలో అనేక విధాలా సాయపడుతుందని రకరకాల పదార్థాలతో కలిపి తింటూ ఉంటూ ఉంటారు. కానీ తేనెతో పాటు ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? అయితే, తేనెతో ఏవి తినకూడదో తెలుసుకుందాం?


తేనె, నెయ్యి :

ఆయుర్వేదం ప్రకారం తేనెతో నెయ్యి తీసుకోవడం హానికరం అని నిరూపించబడింది. ఆయుర్వేదంలో తేనె అమృతం నుంచి తయారవుతుందని నమ్ముతారు. అయితే నెయ్యిలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. తేనె చల్లదనాన్ని కలిగిస్తే నెయ్యికి వేడెక్కించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలపడం వల్ల క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇది కడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.


తేనె, చక్కెర:

చాలా మంది చక్కెరతో పాటు తేనెను తీసుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. ఇకపై శుద్ధి చేసిన చక్కెర లేదా స్వీట్లతో తేనెను తినకుండా జాగ్రత్త తీసుకోండి. నిర్లక్ష్యం వహిస్తే శరీరంలో అదనపు చక్కెర పేరుకుపోయే అవకాశం ఉంది. ఇది ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఇదే కాకుండా తేనెను చేపలతో కూడా ఎప్పుడూ తినకూడదు. ఇది జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసి కడుపులో సమస్యలు తలెత్తేలా చేస్తుంది.


తేనె, పుల్లని పండ్లు :

వేడి తేనెతో పుల్లని పండ్లు కలిపి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కడుపు చికాకుకు కారణమవుతుంది. ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తేనెనే వాడండి. అంతే తప్ప దానిని మరిగించి నీరు, టీ లేదా పాలతో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. తేనెను గాలి చొరబడని కంటైనర్‌లో చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ఎందుకంటే అధికంగా తీసుకోవడం కూడా శరీరానికి హానికరం.

Updated Date - Feb 09 , 2025 | 04:15 PM