Share News

Boil Milk in Right Way : పాలు ఇలా మరిగించకపోతే.. చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే..

ABN , Publish Date - Feb 19 , 2025 | 06:17 PM

Boil Milk in Right Way : పాలు సరైన విధంగా మరిగించకపోతే తాగినా ప్రయోజనాలు ఉండవు. చాలామంది పాలు పొయ్యి మీద పెట్టి కాచేటప్పుడు ఈ తప్పులు చేస్తారు. అందువల్ల, పాలల్లోని పోషకాలు పూర్తిగా నాశనమైతాయి. సరైన పద్ధతిలో పాలను ఇలా మరిగించకపోతే..

Boil Milk in Right Way : పాలు ఇలా మరిగించకపోతే.. చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే..
Avoid common mistakes while boiling milk

Boil Milk in Right Way : పిల్లలు, పెద్దలు ఎవరికైనా పాలు ప్రతి ఒక్కరి ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి దీనిని 'సంపూర్ణ ఆహారం' అని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం. మరిగించిన తర్వాతే పాలు తాగడం అనేది సర్వసాధారణ విషయం. తద్వారా అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. ఆహారం అయితే, పాలు మరిగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తరచుగా చాలామందికి పాలను మరిగించే సరైన మార్గం తెలియదు. దీనివల్ల పాలలోని పోషకాలు నాశనమై తాగినప్పటికీ నిరుపయోగమే అవుతుంది. కాబట్టి, ఇక నుంచి పాలు మరిగించేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో.. సరైన పద్ధతి ఏమిటో తెలుసుకుందాం..


పదే పదే మరిగించడం..

మీరు పాల పోషక విలువలను నశించపోకూడదంటే పాలను పదే పదే మరిగించకూడదు. చాలా మంది మహిళలు పాలను తాజాగా ఉంచడానికి పదే పదే మరిగించి పొరపాటు చేస్తారు. ఇది అస్సలు సరైనది కాదు. ఇలా చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనమవుతాయి. పాలలోని పోషకాలు శరీరానికి అందవని అనేక పరిశోధనలలో వెల్లడైంది. పాలను ఒక్కసారే మరిగింది. తాగే ముందు కొద్దిగా వేడి చేయండి.


ఈ 5 ఆహార పదార్థాలు ఇంట్లోకి తెచ్చుకుంటే.. ఎన్నో అనర్థాలు..


ఎక్కువసేపు మరిగించడం..

కొంతమంది మహిళలు పాలను తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగిస్తుంటారు. ఇలా చేస్తే పాలను చిక్కగా అయ్యి మందపాటి మీగడ వస్తుందని భావిస్తారు. అయితే ఇలా చేయడం కూడా సరైనది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ మంట మీద పాలను ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని పోషకాలు తగ్గుతాయి. దీనివల్ల పాల పూర్తి ప్రయోజనాలను పొందలేము. పాలను ఎల్లప్పుడూ మీడియం మంట మీద మరిగించి అప్పుడప్పుడు చెంచా లేదా గరిటెతో కలిపితే చాలు.


త్వరగా మరిగించడం..

చాలా సార్లు త్వరగా పాలు మరిగించడానికి హై-ప్లేమ్ పెడతారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పద్ధతి కూడా సరైనది కాదు. నిజానికి పాలు తొందరగా మరిగించడం వల్ల అందులోని చక్కెర కరిగిపోతుంది. ప్రోటీన్లు కూడా ఒకే చోట పేరుకుపోతాయి. మీడియం మంట మీద మరిగేటప్పుడు దానిలోని కొవ్వు, నీరు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు కలిసిపోతాయి. కాబట్టి, ఇదే సరైన పద్ధతి.


Read Also : బ్రేక్‌ఫాస్ట్‌లో చిన్న మార్పుతో రూ.83 లక్షలు పొదుపు చేసిన యువతి

కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. కరాచీ స్టేడియంలో అంతా షాక్

YS Sharmila: జగన్‌కు దమ్ము లేదు

మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2025 | 06:22 PM