Weight Loss Tips: ఇవి తింటే వేగంగా బరువు తగ్గుతారు..
ABN , Publish Date - May 24 , 2025 | 08:35 PM
Weight Loss Tips in Telugu: ప్రస్తుత కాలంలో సరికాని జీవన శైలి కారణంగా చాలా మంది ఊబకాయం, స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువుతో అవస్థలు పడుతున్నారు. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
Weight Loss Tips: ప్రస్తుత కాలంలో సరికాని జీవన శైలి కారణంగా చాలా మంది ఊబకాయం, స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువుతో అవస్థలు పడుతున్నారు. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. జమ్ సెంటర్లు, యోగా సెంటర్లు, కాస్మోటిక్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, మన తినే ఆహారం బరువు తగ్గించడంలో చాలా ఉపకరిస్తుందని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలు, ఫలాలు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే గణనీయంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. వీటిలో సహజంగానే కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, ఫైబర్, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కడుపు నిండిన ఫీలింగ్ కలిగించడంతో పాటు.. వేగంగా బరువును తగ్గించడంలో ఉపకరిస్తాయి. వీటిని తినడం వలన రక్తంలో చక్కె స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియను పెంచుతాయి. శరీరంలో అదనపు కేలరీలు స్టోర్ అవ్వగుండా.. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలన అందిస్తాయి. మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. ఈ 9 రకాల పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు తింటే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి రోజువారీ హారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆ తొమ్మిది ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆకుకూరలు
ఆకుకూరల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో అదనపు కేలరీలను పెంచకుండా.. ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. వాటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. చాలా మంది ఎదుర్కునే కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.
2. ఓట్స్
ఓట్స్.. కరిగే ఫైబర్‌తో కూడిన తృణధాన్యం. ముఖ్యంగా బీటా-గ్లూకాన్ ఇందులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. రోజు ఉదయం ఓట్ మీల్ తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అతిగా తినకుండా నిరోధిస్తుంది. రోజంతా చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
3. పెరుగు (గ్రీక్ యోగర్ట్)
గ్రీకు పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. బరువు తగ్గే సమయంలో కండరాలకు శక్తిని ఇస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే ప్రోబయోటిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.
4. గుడ్లు
పోషకాహారాల్లో గుడ్డు చాలా కీలకమైంది. గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరమైన విటమిన్లు ఇందులో ఉంటాయి. అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల కడుపు నిండిన భావన పెరుగుతుంది. అధికంగా ఆహారం తినడకుండా ఉండటంలో సహకరిస్తుంది. హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.
5. చియా గింజలు
చియా గింజలు వాటి బరువు కంటే చాలా రెట్లు నీటిని గ్రహిస్తాయి. వీటిని తింటే.. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. చియా గింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్‌ని స్మూతీ, పెరుగు, ఓట్ మీల్‌లో కలిపి తినొచ్చు.
6. అవకాడోలు
అవకాడోలో కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండూ సంతృప్త, బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి. అవకాడోలో పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేస్తుంది. శరరీంలో కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.
7. బెర్రీలు
బెర్రీలు కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, ఇందులో ఫైబర్, విటమిన్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
8. తృణ దాన్యాలు, డ్రై ఫ్రూట్స్..
తృణ దాన్యాలలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటుంది. తృణ దాన్యాలను తినడం వలన ఆరోగ్యకరమైన బరువు తగ్గే అవకాశం ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
9. చిక్కుళ్ళు..
చిక్కుళ్ళు మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది. దీంతో ఎక్కువ సమయం కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఆకలిని నియంత్రంలో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ని కూడా స్థిరంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహకరిస్తుంది.
అన్నికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం సమతుల భోజనం తినడం, పోషకాలు నిండిన ఆహారం తినడం వలన స్థిరమైన, ఆరోగ్యకరమైన బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించడం జరిగింది. దీనిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. బరువు తగ్గడానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించి.. వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.
Also Read:
Ginger Benefits: అల్లం ఇలా వాడితే కీళ్లనొప్పులు పరార్..
Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ వదిలించుకోవడానికి 5 సింపుల్ చిట్కాలు..
For More Health News and Telugu News..