Share News

Tap Water Infection: ట్యాప్ వాటర్ తాగిన మహిళకు ప్రాణహాని.. ఐదు రోజుల్లోనే మృతి

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:06 PM

ప్రతిరోజు ట్యాప్ వాటర్ (Tap Water Infection) ఉపయోగిస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ఓ మహిళ అలాంటి వాటర్ వినియోగించి తన ప్రాణాలు కోల్పోయింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమని వైద్యులు చెబుతున్నారు.

Tap Water Infection:  ట్యాప్ వాటర్ తాగిన మహిళకు ప్రాణహాని.. ఐదు రోజుల్లోనే మృతి
naegleria fowleri Tap Water Infection

ఓ మహిళ తన ఇంట్లో రోజు కూడా ట్యాప్ వాటర్ (Tap Water Infection) వినియోగించేది. కానీ ఇప్పుడు అదే ఆమె ప్రాణం తీసింది. నల్లా నీటిని వినియోగించడంతో ప్రాణాంతకమైన నేగ్లేరియా ఫౌలేరి (Naegleria Fowleri) అనే అమీబా బ్యాక్టీరియా ఆమెకు సోకింది. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది మానవ మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నీరు తాగినప్పుడు అనుకోకుండా ఆమె ముక్కు నుంచి నీరు వెళ్లినప్పుడు ఆ అమీబా ఒల్ఫాక్టరీ నర్వ్‌ ద్వారా మెదడులోకి ప్రవేశించింది.


చాలా వేగంగా

అప్పుడు అది ఒక ప్రాణాంతక వ్యాధి అయిన ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ (PAM) అనే సంక్రమణకు దారి తీసింది. ఈ వ్యాధి లక్షణాలు మొదట కనిపించేటప్పుడు సాధారణమైన ఫ్లూ లేదా మెనింజిటిస్‌లాగా కనిపిస్తాయి. కానీ ఇది చాలా వేగంగా మనిషిని ప్రభావితం చేస్తుంది. ఎంతలా అంటే దీని లక్షణాలు మొదలైన తర్వాత సగటున ఆ వ్యక్తి ఐదు రోజుల్లోనే మరణించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు.


ఈ వ్యాధి లక్షణాలు

మొదటి దశలో తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ పట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత విపరీతమైన దశలో అపస్మారక స్థితికి వెళ్లడం, శరీరం పనిచేయకపోవడంతోపాటు చివరికి కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు మొదటగా అంత ఈజీగా అర్థం కాకపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలని అంటున్నారు.


ఇటీవల ఘటన

అమెరికాలో ఇటీవల 71 ఏళ్ల మహిళ ఒక విషాదకర ఘటనకు గురయ్యారు. ఆమె ఆర్‌వీ (RV) వాటర్ సిస్టమ్‌ నుంచి వచ్చిన టాప్ వాటర్‌ను ముక్కు ద్వారా ఉపయోగించారు. అదే నీటిలో Naegleria fowleri ఉండడంతో ఆమెకు ఈ ఇన్‌ఫెక్షన్ వచ్చి మరణించారు. ఇది చాలా అరుదు, కానీ అప్రమత్తత తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. వేల కోట్ల మందిలో కొద్ది మందికే వస్తుంది. కానీ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, దానిని ఎదుర్కొవడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు.


ఎలా జాగ్రత్తపడాలి?

  • టాప్ వాటర్‌ను నేరుగా వాడొద్దు

  • మరిగించిన నీటిని మాత్రమే తీసుకోవాలి

  • ఎప్పుడూ స్టెరిలైజ్ చేసిన నీరు లేదా డిస్టిల్డ్ వాటర్ ఉపయోగించాలి

  • ముక్కు నుంచి నీటిని వినియోగించొద్దు, అలా చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి

  • నదులు లేదా సరస్సుల్లో మునిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో నీరు ముక్కులోకి వెళ్లే అవకాశం ఉంటుంది

  • ఇది ప్రధానంగా 30 డిగ్రీల సెల్సియస్ (సుమారు 86 డిగ్రీల ఫారెన్‌హీట్) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా సజీవంగా ఉంటుంది. అంటే వేడి నీటిలో కూడా ఇది జీవిస్తుంది.


ఇవీ చదవండి:

ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..


4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 06:10 PM