Share News

SV University: ఎస్వీయూలో ఇంజనీరింగ్‌, ఫార్మసీలో ప్రత్యేక ఫీజు సీట్లకు అడ్మిషన్లు

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:56 AM

ఎస్వీయూలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రత్యేక ఫీజుతో అడ్మిషన్లకు అనుమతించారు. ఈమేరకు ఎంటెక్‌, ఎంఫార్మసీ, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అవకాశమేర్పడింది. అర్హత,ఆసక్తి ఉన్న విద్యార్థులు డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ కార్యాలయంలో సంప్రదించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భూపతి నాయుడు ప్రకటనలో తెలిపారు.

SV University: ఎస్వీయూలో ఇంజనీరింగ్‌, ఫార్మసీలో ప్రత్యేక ఫీజు సీట్లకు అడ్మిషన్లు

తిరుపతి: ఎస్వీయూ(SVU)లోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రత్యేక ఫీజుతో అడ్మిషన్లకు అనుమతించారు. ఈమేరకు ఎంటెక్‌, ఎంఫార్మసీ, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అవకాశమేర్పడింది. అర్హత,ఆసక్తి ఉన్న విద్యార్థులు డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ కార్యాలయంలో సంప్రదించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భూపతి నాయుడు ప్రకటనలో తెలిపారు. ఎంటెక్‌లో ప్రవేశానికి గేట్‌-2025 మొదటి ప్రాధాన్యత, పీసీ ఈసెట్‌ -2025 రెండవ ప్రాధాన్యత, బీటెక్‌ వారికి చివరి ప్రాధాన్యతలో అడ్మిషన్లు ఇస్తారు.


nani2.3.jpg

ఎంఫార్మసీలో చేరడానికి జీ ప్యాట్‌-2025 వారికి మొదటి ప్రాధాన్యత, పీజీ ఈసెట్‌-2025 రాసిన వారికి రెండవ ప్రాధాన్యత, భీఫార్మసీ ఉన్నవారికి చివరి ప్రాధాన్యత ఇస్తారన్నారు. బీఫార్మసీలో చేరడానికి ఏ.పి.సెట్‌-2025 రాసిన వారికి మొదటి ప్రాధాన్యత, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులకు చివరి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంటెక్‌ కోర్సుకు ప్రత్యేక ఫీజు సంవత్సరానికి రూ. 1,45,170, ఎంఫార్మసీ ప్రత్యేక ఫీజు సంవత్సరానికి రూ. 1, 53,940, బీ ఫార్మసీ ప్రత్యేక ఫీజు సంవత్సరానికి రూ.81 వేలుగా నిర్ణయించారు. సమగ్ర సమాచారం కోసం.. ‘ఎస్వీయూనివర్సిటీ.ఎడ్యూ.ఇన్‌.డీవోఏ’ వెబ్‌సైట్‌లో చూడాలని ఆ ప్రకటనలో సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2025 | 11:56 AM