SSC CGL 2025: డిగ్రీ అర్హతతో 14,582 పోస్టులకు నోటిఫికేషన్.. నెలకు రూ.47 వేల జీతం
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:18 PM
ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. ఇటీవల 14,582 పోస్టులను భర్తీకి SSC CGL నుంచి విడుదలైన నోటిఫికేషన్ కోసం అప్లై చేశారా లేదా. ఇంకా అప్లై చేయకపోతే ఇప్పుడు ఈ పోస్టుల వివరాల గురించి తెలుసుకుని అప్లై చేయండి మరి.
SSC CGL 2025: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఈసారి SSC CGL 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,582 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష 2025 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, జీత భత్యాలు ఎలా ఉంటాయి, ఎలా ఎంపిక చేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యా అర్హత
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి గణితంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II పోస్టులకు, డిగ్రీ కోర్సులోని అన్ని భాగాలు లేదా సెమిస్టర్‌లలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కల్గి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
SSC CGL ఎంపిక ప్రక్రియలో రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి. మొదట టైర్ I, తర్వాత టైర్ II నిర్వహిస్తారు. టైర్ Iలో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు మినహా అన్ని ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు తగ్గించబడతాయి. టైర్ 2లో CBT + స్కిల్ టెస్ట్ + CPTకి ఎంపికైన అభ్యర్థులను అవసరమైతే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆ తర్వాత చివరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి, మెరిట్, పోస్ట్ ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేస్తారు.
టైర్ I పరీక్ష ఎప్పుడు, ఫీజు ఎంత
SSC CGL 2025 టైర్ I పరీక్ష ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30, 2025 మధ్య నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థలు, ట్రిబ్యునళ్లలోని వివిధ గ్రూప్ లలో దాదాపు 14,582 ఖాళీలను భర్తీ చేయాలని SSC లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి అప్లై చేయాలంటే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, రిజర్వేషన్లకు అర్హత ఉన్న SC, ST, PwBD, ESM వర్గాలకు చెందిన అభ్యర్థులు రుసుము చెల్లించకుండా మినహాయింపు పొందుతారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 04 జూలై 2025
ఫీజు చెల్లింపు తేదీ: 05 జూలై 2025
సవరణ తేదీ: జూలై 9 నుంచి జూలై 10, 2025 వరకు
అడ్మిట్ కార్డ్: ఆగస్టు 2025
పరీక్ష తేదీ: ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30, 2025
SSC CGL 2025 జీతాలు
గ్రేడ్ 4 వారికి నెలకు రూ.25,500 నుంచి రూ. 81,100 వరకు
గ్రేడ్ 5 వారికి నెలకు రూ. 29,200 నుంచి రూ. 92,300 వరకు
గ్రేడ్ 6 వారికి నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400 వరకు
గ్రేడ్ 7 వారికి నెలకు రూ.44,900 నుంచి రూ. 1,42,400 వరకు
గ్రేడ్ 8 వారికి నెలకు రూ.47,600 నుంచి రూ. 1,51,100 వరకు
ఇవీ చదవండి:
గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి