Share News

Anantapur: టీచర్ల నియామకాలకు కొత్త విధానం..

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:08 PM

డీఎస్సీ టీచర్ల నియామకాల విషయంలో ఈ సారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్‌ లిస్టు, ఏ కేటగిరీ పోస్టు ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందని కటాఫ్‌ ఇచ్చేవారు. ఈసారి డీఎస్సీ నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడంలేదు.

Anantapur: టీచర్ల నియామకాలకు కొత్త విధానం..

- డీఎస్సీ టాపర్లు, కటాఫ్‌, మెరిట్‌లిస్టుకు చెల్లు

- నేరుగా అర్హత అభ్యర్థులకు మెస్సేజ్‌లు..

- రాష్ట్రశాఖ ఆదేశాలు.. ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు

అనంతపురం: డీఎస్సీ టీచర్ల నియామకాల విషయంలో ఈ సారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్‌ లిస్టు, ఏ కేటగిరీ పోస్టు ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందని కటాఫ్‌ ఇచ్చేవారు. ఈసారి డీఎస్సీ నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడంలేదు. జిల్లాలో 807 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికే డీఎస్సీ పలితాలను విడుదల చేశారు. అభ్యర్థుల తమ హాల్‌ టిక్కెట్‌తో విద్యాశాఖ ఇచ్చిన లింకు ద్వారా ఎన్నిమార్కులు వచ్చాయో తెలుసుకున్నారు.


దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయో ఇప్పటికీ అభ్యర్థులకు తెలియలేదు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్‌ లిస్టు విడుదల చేస్తుందనీ అపుడు ఏయే కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండుంటే పోస్టు వస్తుందో అభ్యర్థులు సులభంగా లెక్కలు కట్టుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డీఎస్సీలో వచ్చిన టాపర్లు, మెరిట్‌ లిస్టు, కటాఫ్‌ వివరాలను విడుదల చేయడంలేదు. కేవలం పోస్టులు, కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తిం చి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెస్సేజ్‌లు పంపనున్నారు.


- రాష్ట్రశాఖ నుంచి మెస్సేజ్‌లు వచ్చిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. రేపో, ఎల్లుండో పరిశీలన కొనసాగించాలనీ, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్‌ నుంచి ఆదేశాలు పంపారు. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్రశాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారనీ,


ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్రశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు ఉన్నారు. అందులో ఒకరిని శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డీఈఓ ప్రసాద్‌బాబు, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఏపీఓ మంజునాథ్‌తో కూడిన బృందం జిల్లాలో డీఎస్సీ ఖాళీల జాబితాను తీసుకెళ్లింది.


దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాట్లు, శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈసారి టీచర్ల నియామకాల్లో టాపర్లు,మెరిట్‌లిస్టు, కటాఫ్‌ విడుదల చేయకుండానే అభ్యర్థులను నేరుగా రాష్ట్రశాఖ మెస్సేజ్‌ల రూపంలో తెలియజేసి వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానించి నియామకాలు చేపడుతుండడంపై అధికారులు, అభ్యర్థుల్లో తీవ్ర చర్చ సాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 12:08 PM