NEET PG 2025 Results Declared: నీట్ పీజీ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:17 PM
నీట్ పీజీ 2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తాజాగా ఈ ఫలితాలను ప్రకటించింది. రిజల్ట్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్‌కార్డ్‌లను కింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ 2025 ఫలితాలు వచ్చేశాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్ష రాసిన 2.42 లక్షల మంది అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్‌కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా (natboard.edu.in) చెక్ చేసుకోవచ్చు (NEET PG 2025 Results Declared).
ఈ సంవత్సరం ఆగస్టు 3న నీట్ పీజీ 2025 పరీక్ష ఒకే షిఫ్ట్‌లో జరిగింది. దేశవ్యాప్తంగా 301 నగరాల్లో 1,052 టెస్ట్ సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. ఇది ఇప్పటివరకు భారతదేశంలో జరిగిన అతిపెద్ద సింగిల్-డే, సింగిల్-షిఫ్ట్ కంప్యూటర్ బేస్డ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దాదాపు 2.42 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.
స్కోర్‌కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లేదా nbe.edu.in ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో NEET PG 2025 సెక్షన్ క్లిక్ చేయండి
తర్వాత Results అనే లింక్‌పై క్లిక్ చేయండి
మీ క్రెడెన్షియల్స్ (యూజర్ ఐడీ, పాస్‌వర్డ్) ఉపయోగించి లాగిన్ అవ్వండి
అక్కడ వచ్చిన మీ స్కోర్‌కార్డ్ చూసి, డౌన్ చేసుకోండి
మీ స్కోర్‌కార్డ్‌ని జాగ్రత్తగా చెక్ చేసి, డౌన్‌లోడ్ చేసుకోండి. స్కోర్‌కార్డులు ఫలితాలు వచ్చిన తర్వాత ఆరు నెలల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఏమైనా సమస్యలు ఉంటే, NBEMS అధికారిక కమ్యూనికేషన్ పోర్టల్ ద్వారా సంప్రదించండి.
ముఖ్య గమనిక!
రీ-ఎవాల్యుయేషన్, రీ-చెకింగ్ లేదా రీ-టోటలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్ట్‌లను స్వీకరించమని NBEMS స్పష్టంగా చెప్పింది. కాబట్టి, మీ స్కోర్‌కార్డ్‌ని జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి.
తర్వాత ఏం జరుగుతుంది?
ఫలితాలు వచ్చేశాయి కాబట్టి, ఇప్పుడు అందరి దృష్టి కౌన్సెలింగ్, సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్‌పై ఉంటుంది. MD, MS, PG డిప్లొమా కోర్సుల కోసం సీట్ల కేటాయింపు త్వరలో మొదలవుతుంది. అలాగే, అభ్యర్థులు అధికారిక కటాఫ్ మార్కుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కటాఫ్‌లు పరీక్ష క్లిష్టత స్థాయి, సీట్ల లభ్యత ఆధారంగా కేటగిరీల వారీగా మారుతాయి.
ఏమైనా సందేహాలు ఉన్నాయా?
మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, NBEMSని 011-45593000 నంబర్‌లో సంప్రదించవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్‌లను విజిట్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి