Artificial Intelligence: పరీక్ష పత్రాలను దిద్దే ‘ఏఐ’..
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:41 AM
పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్‌వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్‌కు ఇండియన్ బిజినెస్ హెడ్‌గా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్ కొనసాగుతున్నారు.
హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence) సహకారంతో దిద్దే సాఫ్ట్‌వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్‌కు ఇండియన్ బిజినెస్ హెడ్‌గా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్(M.Snehit) కొనసాగుతున్నారు. పాఠశాలల్లో పరీక్ష పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులకు తలనొప్పిగా ఉండేది. ఎక్కువ సమయం పరీక్షా పేపర్లను దిద్దడానికి కేటాయించాల్సి వస్తుంది.
నెల పరీక్షలు మొదలుకొని క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, వార్షిక్షా పరీక్షలకు విద్యార్థులు రాసిన పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి www.grademe.ai.com అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా తరగతిలో ఉండే 50మంది విద్యార్థుల పరీక్ష పత్రాలను రెండు నుంచి ఐదు నిమిషాలలోపు దిద్ది మార్కులు ఇచ్చే విధంగా ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. పరీక్ష పత్రాలను దిద్ది మార్కులు వేయడమే కాకుండ, ఎక్కడ తప్పు జరిగింది. ఎలా సరిదిద్దుకోవాలో కూడా ఈ సాఫ్ట్‌వేర్ సూచిస్తుంది. దీని ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థుల పరీక్ష పత్రాలను దిద్దడానికి సులువైంది.

శివరాంపల్లి శ్రీ గాయత్రీ హైస్కూల్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు
శివరాంపల్లిలోని శ్రీగాయత్రి హైస్కూల్‌లో ‘గ్రేడ్ మీ ఏఐ’ ద్వారా పరీక్ష పత్రాలను దిద్దే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇండియా బిజినెస్ హెడ్‌గా ఉన్న ఎం.స్నేహిత్ ప్రారంభించారు. ఈ విధానంలో ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్‌లో సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుం ది. తర్వాత విద్యార్థులకు ఇచ్చిన పరీక్ష పత్రాన్ని ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. తర్వాత విద్యార్థులు రాసిన జవాబు పత్రాన్ని ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే ఒకటి నుంచి రెండు నిమిషాలలోపు జవాబు పత్రాన్ని కరెక్షన్ చేసి మార్కులు ఇస్తుంది. దాంతో పాటు ఎక్కడ పొరపాటు జరిగింది.. ఎలా సరిదిద్దుకోవాలో కూడా సూచిస్తుంది. ఈ విధానం చాలా బాగుందని శ్రీగాయత్రి హైస్కూల్ కరస్పాండెంట్ ఎం.ప్రభాకరచారి తెలిపారు.
తక్కువ ఖర్చుతో.. పరీక్ష పేపర్లను దిద్దవచ్చు
అమెరికాకు చెందిన ఉదయ్ మెహతా సారధ్యంలో అర్వాంచ్ అనే కంపెనీ పేరుతో ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా పరీక్ష పత్రాలను చాలా సులభంగా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో దిద్దవచ్చన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. ఇండియాలో కూడా ‘గ్రేడ్ మీ ఏఐ’ను విస్తరించడానికి కృషి జరుగుతోంది. వివరాలకు 9121415891ను సంప్రదించవచ్చు.
- ఎం.స్నేహిత్, ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్ ఇండియా బిజినెస్ హెడ్
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News