Share News

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ అదనపు ఈవో ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:40 PM

ఈ ఏడాది సుమారు 8లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపారు.

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ అదనపు ఈవో ఏం చెప్పారంటే..
TTD Additional EO Venkaiah Chowdary

తిరుపతి: ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు (Tirumala Vaikunta Dwara Darshanam) జరగనున్న తెలిసిందే. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (TTD Additional EO Venkaiah Chowdary) ప్రత్యేకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(ABN Andhrajyothy)తో మాట్లాడారు. తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

TTD.jpg


టోకెన్ పొందిన ప్రతి భక్తుడికీ రెండు నుంచి మూడు గంటల్లోనే వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ఎటువంటి టోకెన్స్ (Tirumala Tokens) లేకపోయినా.. సర్వదర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కలుగజేస్తామని తెలిపారు. ఈ ఏడాది సుమారు 8లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. భక్తులు టీటీడీ ఇచ్చిన సూచనలను గమనించి తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Jagan Flexi: వైసీపీ కార్యకర్తల వీరంగం.. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

Deputy CM Pawan Kalyan: ఎంతకు దిగజారారు.. పవన్ ఫొటోపై అసభ్యకర పోస్ట్...

Updated Date - Dec 27 , 2025 | 01:20 PM