Sunday: ఆ రోజు ఈ 5 వస్తువులు ఎప్పటికి కొనకండి! ఓ వేళ కొన్నారా..
ABN , Publish Date - May 11 , 2025 | 10:00 PM
Sunday: వారాల్లోకి ఆదివారం శ్రేష్టమైంది. ఆ రోజు సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యానికి మంచిదంటారు. అయితే ఆదివారం ఈ ఐదు వస్తువులను కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆదివారానికో ప్రత్యేకత ఉంది. ఈ రోజు అంతా సెలవుగా భావిస్తారు. కానీ ఈ రోజు ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడిని ఆరాధిస్తే.. అంతా మంచే జరుగుతోంది. అందుకే సూర్యుడిని తేజస్సుతోపాటు ఆరోగ్యానికి చిహ్నంగా భావిస్తారు. అదీకాక ఆదివారం ఆదిత్యుడిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం సైతం పెరుగుతుందని.. జీవితంలో విజయం సాధిస్తారని అంతా నమ్ముతారు. అయితే ఆదివారాల్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే.. అవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఆ ప్రభావం ఇంటిపై ఉంటుందని అంటారు.
ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇనుము అనేది శని గ్రహానికి సంబంధించిన లోహం. ఆదివారం ఇనుము కొనుగోలు చేయడం వల్ల సూర్య భగవానుడికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని అంటారు.
కొత్త వాహనం లేదా వాహన విడి భాగాలు
ఆదివారం వాహనం కొనడం అశుభంగా పరిగణిస్తారు. దీని వల్ల వాహనాలు తరచు చెడిపోవడం లేదా ప్రమాదాలు జరగడం జరుగుతుంది. అందుకే ఈ రోజు వాహన విడిభాగాలు కొనకూడదంటారు.
ఫర్నిచర్ లేదా హార్డ్‌వేర్ వస్తువులు
ఆదివారం ఇంటికి ఫర్నిచర్ లేదా నిర్మాణ సంబంధిత వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు అలాంటి కొనుగోళ్లకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
తోట పని సామాగ్రి
ఆదివారాల్లో చెట్లు, కుండలు, ఎరువులు, విత్తనాలు మొదలైన తోట పనికి అవసరమైన వస్తువులను కొనడం కూడా మానుకోవాలి. ఇది ఇంటి సామరస్యంతోపాటు శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది.
నలుపు,నీలం లేదా బూడిద రంగు దుస్తులు
ఈ రోజున నలుపు, నీలం లేదా బూడిద రంగు దుస్తులు ధరించడం అంత మంచిది కాదు. అలాగే ఈ రోజు షాపింగ్ చేయడం మానుకోవాలి. సూర్యుడికి ఈ రంగులు అసలు ఇష్టం ఉండదంటారు. దీంతో ఆయన అనుగ్రహాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Nominated Posts: మళ్లీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్