Share News

Gift to Temple: ఆలయానికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో.. ఏంటో తెలుసా..

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:06 PM

మతపరైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏనుగులను వినియోగించడం సర్వసాధారణం. అయితే, ఈ అంశంపై ఏళ్లుగా వివాదాస్పదమవుతూనే ఉంది. జంతు సంరక్షణ చట్టం ప్రకారం.. ఇది అంగీకారయోగ్యం కానిది. అయినప్పటికీ..

Gift to Temple: ఆలయానికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో.. ఏంటో తెలుసా..
Bollywood Actor Suniel Shetty

బెంగళూరు, ఫిబ్రవరి 24: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి శిలామఠానికి యాంత్రిక/రోబోటిక్ ఏనుగును బహుకరించారు. ముంబైకి చెందిన క్యూపా, పెటా ఇండియా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో థాకర్సే ఫౌండేషన్ ఈ ఏనుగును మఠానికి అందించారు. దీనిని స్వీకరించిన ఆలయ అధికారులు.. ఆ రోబోటిక్ ఏనుగుకు ఉమామహేశ్వరగా నామకరణం చేశారు. 800 కిలోల బరువు, 3 మీటర్ల పొడవున్న రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహుమతి ఇచ్చిన సునీల్ శెట్టి.. ఒక వీడియోను విడుదల చేశారు. ఆలయాల్లో రోబోటిక్ ఏనుగుల ప్రాధాన్యతను వివరించారు. అడవి ఏనుగులు అడవిలోనే ఉండటం మేలు అని పేర్కొన్నారు. అవి చెట్ల ద్వారా వచ్చే పండ్లు, కాయలను తినడం వలన విత్తనాలు సహజసిద్ధంగా వెదజల్లబడుతాయని, తద్వారా చెట్ల విస్తీర్ణం పెరుగుతుందన్నారు. దీని ప్రభావం వాతావరణంపై గణనీయంగా ఉంటుందని సునీల్ శెట్టి పేర్కొన్నారు. ‘ఏనుగుల సంక్షేమం, భూమి సంరక్షణ, దేవుని సృష్టిని రక్షించేందుకు.. సాంప్రదాయ ఆచారాలు, వేడుకల్లో పాల్గొనడానికి వీలు కల్పించే ఈ కీలకమైన ప్రాజెక్టులో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా), ఇండియా అండ్ కంపాషన్ అన్‌లిమిటెడ్ ప్లస్ యాక్షన్(క్యూపా)తో కలిసి పని చేయడం నాకు సంతోషంగా ఉంది’ అని సునీల్ శెట్టి పేర్కొన్నారు.


Robotic-ELephant-2.jpg

మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏనుగులను వినియోగించడం సర్వసాధారణం. అయితే, ఈ అంశంపై ఏళ్లుగా వివాదాస్పదమవుతూనే ఉంది. జంతు సంరక్షణ చట్టం ప్రకారం.. ఇది అంగీకారయోగ్యం కానిది. అయినప్పటికీ.. పలు దేవాలయాలు సంప్రదాయం పేరిట ఏనుగులను వినియోగిస్తున్నాయి. దావణగెరె జిల్లాలోని తవరేకెరెలో 1,200 సంవత్సరాల నాటి పురాతన ఆలయం, ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన శిలమఠంలోని శ్రీ ఉమామహేశ్వర వీరభద్రేశ్వర ఆలయం.. వన్య ప్రాణుల చట్టాన్ని గౌరవిస్తూ, జంతువుల స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకుని ఈ ఆలయంలో పూజా క్రతువుల కోసం ఏనాడూ ఏనుగులను వినియోగించలేదు. ఇది గుర్తించిన సునీల్ శెట్టి.. ఆ శిలామఠానికి రోబోటిక్ ఏనుగును బహుకరించారు.


శిలామఠం పీఠాధిపతి రేణుకా శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ.. ఈ రోబోటిక్ ఏనుగు ఉమామహేశ్వరను స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు. ఏళ్లుగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను సురక్షితంగా, జంతు స్నేహపూర్వక పద్ధతిలో నిర్వహిస్తామని వివరించారు. ఇతర దేవాలయాలు, మఠాలు కూడా తమ తమ దేవాలయాల్లో నిజమైన ఏనుగుకు బదులుగా యాంత్రిక ఏనుగులను వినియోగించాలని శిలామఠం పీఠాధిపతి విజ్ఞప్తి చేశారు. వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనుగును బహుమతిగా ఇచ్చారని అభినవ సిదాలింగ శివాచార్య స్వామీజీ గుర్తు చేశారు. అయితే, తాము ఆ బహుమతిని మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఇప్పుడు ఈ యాంత్రిక ఏనుగు చెవులు, తొండం ఊపడం ద్వారా నిజమైన ఏనుగు అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.


దావణగెరె ఎమ్మెల్యే బసవరాజు వి శివగంగ.. ఉమామహేశ్వరను(రోబోటిక్ ఏనుగును) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. ఉమామహేశ్వరుడు నిజమైన ఏనుగులా కనిపిస్తున్నాడని అన్నారు. ‘శ్రీ ఉమామహేశ్వర వీరభద్రేశ్వర ఆలయ నిర్వాహకులను అభినందిస్తున్నాము. బందీలుగా ఉన్న ఏనుగులపై క్రూరత్వాన్ని అంతం చేయడానికి ఇతర దేవాలయాలు సైతం యాంత్రిక ఏనుగును ఉపయోగించమని ప్రోత్సహించాలనుకుంటున్నాము’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే కె. మాదల్ విరూపాక్ష మాట్లాడుతూ.. ఆలయానికి బహుమతిగా ఇచ్చిన రోబోటిక్ ఏనుగు అద్భుతంగా ఉందన్నారు. నిజమైన ఏనుగును బందించడం క్రూరత్వం అవుతుందని.. దీనికి ప్రత్యామ్నాయంగా రోబోటిక్ ఏనుగులను వినియోగించడం ఉత్తమం అని చెప్పారు. వన్యప్రాణాలను రక్షించడానికి దేశవ్యాప్తంగా ఆలయాల్లో నిజమైన ఏనుగులకు బదులుగా యాంత్రిక ఏనుగులను ప్రోత్సహించడం ఉత్తమం అని అన్నారు.


విషాద ఘటనలు ఎన్నో..

ఆలయాల్లో ఏనుగులు జనంపై దాడి చేసిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒక్కసారిగా రెచ్చిపోయి భక్తులపై ఎటాక్ చేస్తున్నాయి. భక్తులను చంపేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మావటీలను సైతం తొక్కిన చంపిన ఘటను ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. చాలా మంది దాతలు ఆలయాలకు నిజమైన ఏనుగులకు బదులుగా యాంత్రిక/రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇస్తున్నారు.


రోబోటిక్ ఏనుగు స్పెషాలిటీ ఇదే..

సునీల్ శెట్టి బహుకరించిన ఈ రోబోటిక్ ఏనుగు బరువు ఇంచుమించు ఒరిజినల్ ఏనుగు బరువంత ఉంటుంది. 800 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉంది. దీని ధర రూ. 17 లక్షలు అని సమాచారం. ఈ ఏనుగు చూడటానికి నిజమైన ఏనుగు మాదిరిగానే ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇది తన చెవులను ఊపడం, తొండంతో భక్తులను ఆశీర్వదించడం, కళ్లు ఆర్పడం వంటివి రిమోట్ కంట్రోల్ సహాయంతో చేస్తుంది. దీనిని ట్రాలీపై ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గుడి కార్యక్రమాలకు, ఉత్సవ మూర్తుల ఊరేగింపులకు ఈ ఏనుగును ఉపయోగించడానికి వీలుంటుంది. దీనిని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల భక్తులకు, ప్రజలకు ఎలాంటి హానీ, ఇబ్బందులు తలెత్తవు. పైగా ఏనుగు నిర్వహణ కోసం పెద్దగా ఖర్చు కూడా ఉండదు.

Robotic-ELephant-3.jpg


Also Read:

ఆ భయం వల్లే.. ప్రతిపక్షహోదాపై ఎంపీ అవినాష్ హాట్ కామెంట్స్

గేదెల కోసం పెళ్లి పీటలెక్కిన మహిళ.. చివరకు..

కేసీఆర్‌పై మంత్రి సురేఖ పంచ్ డైలాగ్స్

For More National News and Telugu News..

Updated Date - Feb 24 , 2025 | 01:06 PM