Anantapur: ప్రేమ పెళ్లికి నిరాకరించారని..
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:29 PM
మండలంలోని రాఘవంపల్లికి చెందిన యువకుడు గుణ (20) ప్రేమ పెళ్లికి బంధువులు నిరాకరించారన్న మనస్తాపంతో శుక్రవారం ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- యువకుడి ఆత్మహత్య
బత్తలపల్లి(అనంతపురం): మండలంలోని రాఘవంపల్లి(Raghavampalli)కి చెందిన యువకుడు గుణ (20) ప్రేమ పెళ్లికి బంధువులు నిరాకరించారన్న మనస్తాపంతో శుక్రవారం ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాఘవంపల్లికి చెందిన నరసింహుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు గుణ పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే వ్యవసాయం చేసుకుంటుండేవాడు. బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమను ఆంగీకరించలేదు.

దీంతో గుణ మనస్తాపం చెందాడు. తోటలోనే వారి ఇల్లు ఉండేది. శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో పడుకున్న గుణ తోటలోని మామిడి చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. ఉదయం అతడు కనిపించకపోవడంతో కుటుంబీకులు తోటలో వెతకగా.. మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుణ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News