Share News

Chennai News: పెళ్లి రిసెప్షన్‌లో విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మహిళ మృతి

ABN , Publish Date - Aug 21 , 2025 | 10:51 AM

కాంచీపురంలో ఓ వివాహ రిసెప్షన్‌ వేడుకల సందర్భంగా అందరితో కలిసి డ్యాన్స్‌ చేసిన మహిళా ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్ప కూలింది. కాంచీపురంలోని ప్రముఖ మందుల దుకాణం యజమాని జ్ఞానం, ఆయన భార్య జీవాతో కలిసి మంగళవారం రాత్రి జరిగిన బంధువుల పెళ్లి వేడుకలకు వెళ్లారు.

Chennai News: పెళ్లి రిసెప్షన్‌లో విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మహిళ మృతి

చెన్నై: కాంచీపురం(Kanchipuram)లో ఓ వివాహ రిసెప్షన్‌ వేడుకల సందర్భంగా అందరితో కలిసి డ్యాన్స్‌ చేసిన మహిళా ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్ప కూలింది. కాంచీపురంలోని ప్రముఖ మందుల దుకాణం యజమాని జ్ఞానం, ఆయన భార్య జీవాతో కలిసి మంగళవారం రాత్రి జరిగిన బంధువుల పెళ్లి వేడుకలకు వెళ్లారు. ఆ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కొంతమంది నృత్యం చేశారు.


nani2.jpg

ఆ సమయంలో జీవా(Jeeva) స్టేజ్‌పైకి ఎక్కి నృత్యం చేశారు. పది నిమిషాల తరువాత జీవా ఉన్నట్టుండి కుప్పకూలారు. వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్సలు చేసినప్పటికీ కళ్లు తెరవకపోవడంతో పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్టు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2025 | 10:51 AM