Share News

Hyderabad: ఖైరతాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్య

ABN , Publish Date - Aug 08 , 2025 | 08:01 AM

ఖైరతాబాద్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తి తలపై బండరాయితో కొట్టడం వల్లే అతడు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ నాగరాజు, డీఐ సైదులు వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఆ వ్యక్తి మంగళవారం రాత్రి రక్తపు మడుగులో పడి ఉండ డం చూసిన ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Hyderabad: ఖైరతాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్: ఖైరతాబాద్‌(Khairatabad)లో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తి తలపై బండరాయితో కొట్టడం వల్లే అతడు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ నాగరాజు, డీఐ సైదులు వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌(Khairatabad Metro Station) సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఆ వ్యక్తి మంగళవారం రాత్రి రక్తపు మడుగులో పడి ఉండ డం చూసిన ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.


city3.2.jpg

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి బండరాయితో తలపై బాదినట్లు గుర్తించారు. మొదట హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం హత్య చేయబడ్డట్లు కేసును మార్చి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, బిచ్చగాడు అయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2025 | 08:01 AM