Hyderabad: నార్సింగ్‌లో విషాదం.. చెరువులో మునిగి అమ్మమ్మ, మనవరాలు మృతి
ABN , Publish Date - Oct 22 , 2025 | 07:57 AM
దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో మునిగి అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్: దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో మునిగి అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్(Narsingh Police Station) పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జవహర్‌లాల్ నెహ్రూ క్వార్టర్స్(Jawaharlal Nehru Quarters)లో నివసిస్తున్న యూసు్‌ఫబీ(60) తన ఇద్దరు మనవరాళ్లు సబియా(10),

ఆయేషా(19)తో కలిసి దుస్తులు ఉతికేందుకు పీరం చెరువు వద్దకు వెళ్లింది. యూసుబ్‌బీ, సబియా(Youssef, Sabia) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. ఆయేషా ఇచ్చిన సమాచారంతో ఆమె తండ్రి మహమ్మద్ స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News