Share News

Hyderabad: విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ..

ABN , Publish Date - Sep 20 , 2025 | 06:47 AM

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ టైరు పగిలి ఇన్నోవా కారు బోల్తా పడిన సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మండల కేంద్రమైన చౌటకూర్‌(Chautakur)కు సమీపంలో సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది.

Hyderabad: విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ..

- చౌటకూర్‌ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు బోల్తా

- మూడేళ్ల చిన్నారి మృతి, మరో ఆరుగురికి గాయాలు

హైదరాబాద్: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ టైరు పగిలి ఇన్నోవా కారు బోల్తా పడిన సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మండల కేంద్రమైన చౌటకూర్‌(Chautakur)కు సమీపంలో సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. పుల్కల్‌ ఎస్‌ఐ ఎన్‌.విశ్వజన్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్‌ ప్రాంతం శ్రీరాంనగర్‌ కాలనీ(Sriramnagar Colony)కి చెందిన తాళ్ల గౌతమ్‌గౌడ్‌ తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లీదండ్రులు, డ్రైవర్‌తో కలిసి ఈ నెల 14న ఇన్నోవా కారు లో షిర్డీ యాత్రకు వెళ్లారు.


ఇంటికి వెళ్లేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారిపై చౌటకూర్‌ శివారులోకి రాగానే కారు వెనుకభాగంలోని ఎడమ వైపు టైరు పగిలింది. దీంతో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో గౌతమ్‌గౌడ్‌తో పాటు వాహనంలోని వారందరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.


city1.2.jpg

కాగా, గౌతమ్‌గౌడ్‌ మూడేళ్ల కూతురు శ్రీతకు బలమైన మూగ దెబ్బలు తగలడం వల్ల మృతి చెందిందని డాక్టర్లు ధృవీకరించారు. మిగిలిన వారందరూ గాయాలతో బయటపడ్డారు. చిన్నారి మృతదేహానికి సంగారెడ్డి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గౌతమ్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు పుల్కల్‌ ఎస్‌ఐ విశ్వజన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Sep 20 , 2025 | 06:47 AM