Tirupati: మద్యంతాగి.. కత్తితో వీరంగం
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:37 PM
తిరుపతిలో రౌడీ కల్చర్ కోరలు చాచింది. ఓ రౌడీ మద్యం మత్తులో కత్తితో వీరంగం చేస్తూ నడిరోడ్డుపై సోమవారం జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడితోపాటు ప్రత్యర్థినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
- తిరుపతిలో ఇద్దరిని అరెస్టు చేసి..
- వీధిలో నడిపించుకుంటూ వెళ్లిన పోలీసులు
తిరుపతి: తిరుపతి(Tirupati)లో రౌడీ కల్చర్ కోరలు చాచింది. ఓ రౌడీ మద్యం మత్తులో కత్తితో వీరంగం చేస్తూ నడిరోడ్డుపై సోమవారం జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడితోపాటు ప్రత్యర్థినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిరుపతి నగరం ఎస్టీవీ నగర్‌కు చెందిన ఫిరోజ్, సయ్యద్ బాషా కొన్నేళ్లుగా పాత కక్షలున్నాయి.
గతంలో వీరిద్దరూ కత్తులతో పొడుచుకుని హత్యాయత్నాలకు పాల్పడ్డారు. జైలుకూ వెళ్లి వచ్చారు. ఫిరోజ్ రౌడీలా తిరుగుతూ, స్నేహితులతో గలాటాలకు దిగి బెదిరించడం పరిపాటిగా మారింది. ఇతడిపై దాదాపు 19 కేసులు ఉన్నాయని, ఇది వరకే రౌడీ షీట్ నమోదై ఉందని ఈస్ట్ సీఐ శ్రీనివాసులు చెప్పారు. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డ సయ్యద్ బాషా, ఫిరోజ్ మధ్య ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాల్లో తీవ్ర గొడవలున్నాయి.

ఈ క్రమంలో సోమవారం ఎస్టీవీ నగర్‌లోని విక్టరీ వైన్స్ వద్ద ఫిరోజ్ మద్యం తాగి, చేతిలో కత్తి పెట్టుకుని వీరంగం చేశాడు. బాగా తెలిసిన వారికి కత్తి చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. అదే షాపు వద్ద సయ్యద్ బాషా కూడా మద్యం తాగుతున్నాడు.ఈ క్రమంలో ఫిరోజ్ వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ భక్తవత్సలం ఆదేశాలతో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ హేమాద్రి, సిబ్బంది అక్కడికి వెళ్లారు. నడి రోడ్డుపై కత్తి పెట్టుకుని వీరంగం చేస్తున్న ఫిరోజ్‌ను, అక్కడే ఉన్న సయ్యద్‌బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఎస్టీవీ నగర్‌లో జరిగిన రెండు ఘటనల్లోనూ ఫిరోజ్ హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా, ఫిరోజ్, సయ్యద్‌బాషాపై ఆర్మ్స్ యాక్టు కింద కేసు నమోదు చేసి ఈస్ట్ స్టేషన్ నుంచి వీధుల్లో నడిపించుకుంటూ కోర్టు వద్దకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ శ్రీనివాసులు చెప్పారు. గత కొంత కాలంగా పోలీసుల రికార్డుల్లోకెక్కిన రౌడీల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం, వారి కదలికలపై నిఘా ఉంచి చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా వీరిపట్ల కఠిన వైఖరి అవలంభించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
Read Latest Telangana News and Nationa