Srikalahasti: దుకాణం యజమానిని బురిడీ కొట్టించి ఫోన్‌పే ద్వారా..
ABN , Publish Date - May 17 , 2025 | 12:16 PM
ఓ దుకాణం వ్యాపారిని బురిడీ కొట్టించి రూ. రూ.81వేలను ఎత్తుకెళ్లిన ఘరానా మోసగాళ్ల విషయం వెలుగులోకి వచ్చింది. సరుకులు కొనుగోలు పేరుతో.. దుకాణానికి వచ్చి ఆ షాపు యజమాని ఖాతా నుంచే నగదు మాయం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే..

- రూ.81వేల లూటీ
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
శ్రీకాళహస్తి(చిత్తూరు): చిల్లర దుకాణం వ్యాపారిని బురిడీ కొట్టించిన ఇద్దరు టక్కరి దొంగలు రూ.81వేలను స్వాహా చేశారు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సరికొత్త సైబర్ క్రైం శ్రీకాళహస్తిలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి పట్టణం గాంధీవీధికి చెందిన మునిస్వామి.. తిప్ప ప్రాంతం ఆర్టీసీ రోడ్డులో ప్రొవిజన్‌షాపును నిర్వహిస్తుంటాడు. బుధవారం రాత్రి ఇద్దరు యువకులు సరుకులు కొనుగోలు కోసం మునిస్వామి దుకాణానికి వచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: ఉయ్యాల ఊగుతూ మృత్యువు ఒడిలోకి..
రూ.5వేలకు సరుకులు కొనుగోలు చేసిన తరువాత తమ వద్ద రూ.వెయ్యి నగదు మాత్రమే ఉందన్నారు. మిగతా రూ.4వేలను ఫోన్‌పే చేసేందుకు తమ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని నమ్మించారు. దుకాణదారుడి సెల్‌ఫోన్ నుంచి తమ నాన్నకు ఫోన్ చేసి మిగిలిన రూ.4వేలను ఫోన్‌పై ద్వారా జమ చేస్తామని నమ్మించారు. దీంతో మునస్వామి వారికి ఫోన్ ఇచ్చాడు. ఒక యువకుడు దుకాణదారుడిని మాటల్లో పెట్టాడు. మరో యువకుడు మునస్వామి సెల్‌ఫోన్‌లో ఫోన్‌పేను ఆపరేట్ చేసి తిరిగి అప్పగించాడు.
ఆ తరువాత కొనుగోలు కోసం వచ్చిన యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటి తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.81వేలు నగదు విత్ డ్రా అయినట్లు మునస్వామికి మెసెజ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యాడు. సరుకుల కొనుగోలు కోసం వచ్చిన ఇద్దరు యువకులకు ఫోన్ ఇవ్వడం కారణంగా నగదు లూటీ అయినట్లు గుర్తించి బాధితుడు గురువారం శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదని బాధితుడు తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Variety Recipes: నోరూరించే రాగి రుచులు
Gachibowli: రేవంత్ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద
సురేఖ తెగించి కమీషన్ మంత్రుల పేర్లు చెప్పాలి
భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు
Read Latest Telangana News and National News