Share News

Chennai: ఉయ్యాల ఊగుతూ మృత్యువు ఒడిలోకి..

ABN , Publish Date - May 17 , 2025 | 11:35 AM

మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం అంటే బహుశా ఇదేనేమో.. ఇంటిముందు చీరతో ఉయ్యాల కట్టుకుని దానిలో ఊగుతుండగా.. అది కాస్త గొంతుకు చుట్టుకోవడంతో ఊపిరాడక ఓ బాలిక మృతిచెందింది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Chennai: ఉయ్యాల ఊగుతూ మృత్యువు ఒడిలోకి..

- చీర గొంతుకు చుట్టుకుని విద్యార్థిని మృతి

చెన్నై: ఉయ్యాల ఊగుతున్న సమయంలో చీర గొంతుకు బిగుసుకుని పాఠశాల విద్యార్థిని మృతిచెందిన ఘటన తిరువణ్ణామలై(Tiruvannamalai) జిల్లాలో చోటుచేసుకుంది. ఆరణి సమీపం ఈబీ నగర్‌ ప్రాంతానికి చెందిన మురుగన్‌-రేఖ దంపతుల కుమార్తె భాగ్య (11) వేసవి సెలవులు కావడంతో ఇంటిముందు చీరతో ఉయ్యాల కట్టుకుని పిల్లలతో కలిసి ఊగుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: నో డౌట్.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే..


nani3.2.jpg

ఆ సమయంలో.. చీర భాగ్య గొంతుకు చుట్టుకోవడంతో ఆమె స్పృహతప్పింది. చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే ఆరణి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే భాగ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబంలో విషావం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

Variety Recipes: నోరూరించే రాగి రుచులు

Gachibowli: రేవంత్‌ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద

సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు

Read Latest Telangana News and National News

Updated Date - May 17 , 2025 | 11:35 AM