CM Stalin: నో డౌట్.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే..
ABN , Publish Date - May 17 , 2025 | 10:59 AM
నో డౌట్.. రాసిపెట్టుకోండి.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు.. అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే ద్రావిడ తరహా పాలనపై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని స్టాలిన్ అన్నారు.
- 2036 వరకు రాష్ట్రంలో డీఎంకే పాలనే
- సీఎం స్టాలిన్ ధీమా
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు 2036లో జరుగనున్న ఎన్నికల్లో కూడా డీఎంకే గెలిచి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ధీమా వ్యక్తం చేశారు. ఊటీలో ఎంపీ ఎ.రాజాతో కలిసి ఆయన వాకింగ్‌కు వెళ్ళారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... నీలగిరి జిల్లాల్లో ఐదురోజుల పర్యటన చాలా ఉత్సాహంగా గడించిందని, ఈ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే అవకాశం కూడా లభించిందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: చదువుకు వయసు అడ్డం కాదుగా.. ఏడు పదుల వయసులో..
డీఎంకే(DMK) ద్రావిడ తరహా పాలనపై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ప్లవర్‌షోకు మంచి స్పందన వస్తోందని, తొలి రోజే వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సుప్రీం కోర్టును రాష్ట్రపతి 14 రకాల ప్రశ్నలతో వివరణ కోరిన అంశంపై త్వరలో బీజేపీ(BJP)యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన మీదట భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

అన్నాడీఎంకే బీజేపీతోనే కాకుండా మరిన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అపవిత్ర కూటమి ఘోరపరాజయాన్ని చవి చూడకతప్పదన్నారు. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఇక వరుసగా మరో మూడుసార్లు కూడా రాష్ట్రంలో డీఎంకే పాలనే కొనసాగుతుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Variety Recipes: నోరూరించే రాగి రుచులు
Gachibowli: రేవంత్ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద
సురేఖ తెగించి కమీషన్ మంత్రుల పేర్లు చెప్పాలి
భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు
Read Latest Telangana News and National News