Cyber criminals: యూకేలో ఉద్యోగం పేరుతో రూ.3.7 లక్షలు కాజేశారు
ABN , Publish Date - Jan 22 , 2025 | 10:01 AM
యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.3.7 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్ సిటీ: యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.3.7 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 41 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి విదేశాల్లో ఉద్యోగం కోసం ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో తన రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేశాడు. వారం క్రింత గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
ఈ వార్తను కూడా చదవండి: Manda krishna Madiga: మోదీ వద్దకు కాకుండా ఎక్కడికెళ్లాలి..
తాను ఫైన్ డాట్ కామ్ నుంచి కాల్ చేస్తున్నట్లు పరిచయం చేసుకున్న వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం కోసం రెజ్యూమ్ సెలెక్ట్ అయిందని చెప్పాడు. యూకేలో మంచి కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడని, విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వెంటనే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, జాబ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత డబ్బు చెల్లించాలని సూచించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు మూడు విడతల్లో రూ.3.7లక్షలు చెల్లించాడు.

ఆ తర్వాత సైతం ఏదో ఒక ఫీజు కింద డబ్బు చెల్లించాలని చెప్పడం తప్ప.. ఎక్కడా ఉద్యోగం గురించి గానీ, యూకేకు వెళ్లే ప్రాసెస్ గురించి గానీ చెప్పకుండా దాటవేస్తున్నారు. దీనిపై బాధితుడు నిలదీయడంతో నేరగాళ్లు స్పందించడం మానేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ ధార కవిత తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే
ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Read Latest Telangana News and National News