Share News

Hyderabad: చంచల్‌గూడ జైలునుంచి పోలీస్‌ కస్టడీకి మస్తాన్‌సాయి..

ABN , Publish Date - Feb 14 , 2025 | 10:26 AM

చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో రిమాండ్‌లో ఉన్న మస్తాన్‌సాయి(Mastan Sai)ని నార్సింగ్‌ పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. సైబర్‌ క్రైం, లైంగిక దాడి, బ్లాక్‌మెయిలింగ్‌ వంటి కేసులో మస్తాన్‌సాయిని పోలీసులు ఈనెల 3న అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.

Hyderabad: చంచల్‌గూడ జైలునుంచి పోలీస్‌ కస్టడీకి మస్తాన్‌సాయి..

హైదరాబాద్: చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో రిమాండ్‌లో ఉన్న మస్తాన్‌సాయి(Mastan Sai)ని నార్సింగ్‌ పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. సైబర్‌ క్రైం, లైంగిక దాడి, బ్లాక్‌మెయిలింగ్‌ వంటి కేసులో మస్తాన్‌సాయిని పోలీసులు ఈనెల 3న అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. చంచల్‌గూడ జైలు నుంచి సాయంత్రం 4గంటల ప్రాంతంలో నార్సింగ్‌ పోలీస్‏స్టేషన్‌(Narsingh Police Station)కు తీసుకువచ్చిన మస్తాన్‌సాయిని మూడు రోజులు పాటు విచారించనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Chicken: అన్నానగర్‌లో కుళ్లిన చికెన్‌ అమ్మకాలు..


పోలీసులు మస్తాన్‌సాయికి చెందిన హార్డ్‌ డిస్క్‏ను ఓపెన్‌ చేసి, అందులో వివరాలు సేకరించనున్నారు. హార్డ్‌డిస్క్ లో ఏముంది.. లావణ్య చెప్పినట్లు అశ్లీల రికార్డింగులు ఉన్నాయా? మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి? అన్న విషయంపై పోలీసులు ఆరా తీయనున్నారు. అయితే మస్తాన్‌సాయి పోలీసులతో సానుకూలంగానే ఉన్నట్లు, అన్ని వివరాలను వెళ్లడించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం నివేదికను కోర్టుకు సమర్పిస్తామని నార్సింగ్‌ పోలీసులు తెలిపారు.


కోర్టులో తేల్చుకుంటా: లావణ్య

పోలీసులు మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత లావణ్య కోకాపేట్‌(Kokapet)లోని తన నివాసంలో కొంతమంది మీడియా ప్రతినిధులతో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. పోలీసుల విచారణలో చాలా విషయాలు వెలుగు చూస్తాయన్నారు. ఆ తర్వాత ఆయా విషయాలపై తాను కోర్టుకు వెళ్లి తేల్చుకుంటానని చెప్పారు. రాజ్‌తరుణ్‌ కుటుంబానికి ఆమె ఈ సందర్భంగా క్షమాపణ తెలిపారు. తాను ఇంకోసారి మీడియా ముందుకు రానని, ఏ విషయమైనా కోర్టులో తేల్చుకుంటానని అన్నారు. సెప్టెంబర్‌లో డీఐతో ఓ కేసు విషయం మాట్లాడాలని.. అయితే, ఈ డీఐ అంశంలో తన అనుమతిలేకుండా చాలామంది వీడియోలు, వాయిస్‌ రికార్డులు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

ఈవార్తను కూడా చదవండి: సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2025 | 10:26 AM