Share News

Hyderabad: కుర్చీలు తీయమన్నందుకు హత్య..

ABN , Publish Date - Mar 14 , 2025 | 08:31 AM

ఓ చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. కంచన్‌బాగ్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: కుర్చీలు తీయమన్నందుకు హత్య..

- కొందరు యువకుల దాష్టీకం

- విషాదంగా మారిన చిన్న వివాదం

హైదరాబాద్: చిన్న విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. దుకాణం ఎదుట వేసిన కుర్చీలను తీయమన్నందుకు యజమానిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. కంచన్‌బాగ్‌ పోలీస్‏స్టేషన్‌(Kanchanbagh Police Station) పరిధి హఫీజ్‌ బాబా నగర్‌కు చెందిన మహ్మద్‌ జకీర్‌ఖాన్‌(53) కిరాణ దుకాణం నడిపిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..


బుధవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జకీర్‌ఖాన్‌ దుకాణం పక్కనున్న పాన్‌షా్‌పనకు కొందరు వ్యక్తులు వచ్చారు. వాళ్లు జకీర్‌ఖాన్‌ దుకాణానికి అడ్డుగా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. దుకాణం ముందు కుర్చీలు తీయాలని జకీర్‌ఖాన్‌ వారికి చెప్పాడు. పట్టించుకోకపోవడంతో జకీర్‌ఖానే కుర్చీలను పక్కకు తొలగించారు. దీంతో పాన్‌షా్‌పకు చెందిన ఫహీమ్‌(26), అజీమ్‌(28)తో పాటు మరికొందరు జకీర్‌ఖాన్‌(Zakir Khan)తో వాగ్వాదానికి దిగారు.


city4.jpg

మాటామాటా పెరిగి జకీర్‌ఖాన్‌పై చేయి చేసుకున్నారు. దీంతో గతంలో గుండెకు ఆపరేషన్‌ చేయించుకున్న జకీర్‌ఖాన్‌ అపస్మారకస్థితికి చేరడంతో స్థానికులు ఆయన కుమారులకు సమాచారం అందించారు. వారక్కడకు చేరుకొని పాన్‌షాప్‌(Pan Shop) నిర్వాహకులను ప్రశ్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. జకీర్‌ఖాన్‌ను చికిత్స నిమిత్తం అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించగా అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. జకీర్‌ఖాన్‌ కుమారుడు జుబైన్‌ఖాన్‌ కంచన్‌బాగ్‌ పోలీ్‌సస్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 14 , 2025 | 08:31 AM