Hyderabad: దగ్గు మందు పేరుతో మత్తు దందా..
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:47 AM
మత్తు కలిగించే నిషేధిత దగ్గు మందును విక్రయిస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 102 బాటిళ్ల మత్తుటానిక్‌ను సీజ్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్‌నగర్ కొత్తపేట ప్రాంతానికి చెందిన మూసం లక్ష్మణ్ అష్టలక్ష్మి ఆలయ పరిసరాల్లో నిషేధిత దగ్గుమందు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం వచ్చింది.
- వ్యక్తి అరెస్టు.. 102 బాటిళ్లు స్వాధీనం
- మెడికల్ హాల్స్‌పై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్‌సిటీ: మత్తు కలిగించే నిషేధిత దగ్గు మందును విక్రయిస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 102 బాటిళ్ల మత్తుటానిక్‌ను సీజ్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్‌నగర్ కొత్తపేట(Saroornagar Kothapet) ప్రాంతానికి చెందిన మూసం లక్ష్మణ్ అష్టలక్ష్మి ఆలయ పరిసరాల్లో నిషేధిత దగ్గుమందు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం వచ్చింది.
దాంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ బాలరాజు, ఎస్సై రవి తన సిబ్బందితో కలిసి లక్ష్మణ్ కదలికలపై నిఘా పెట్టారు. గురువారం మందమల్లమ్మ చౌరస్తా నుంచి 102 (నిషేదిత దగ్గు మందు) బాటిళ్లను కొనుగోలు చేసి బైక్‌పై తీసుకెళ్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. రూ. 190 ఎంఆర్‌పీ ధర కలిగిన ఈ దగ్గు మందు బాటిల్స్‌ను లక్ష్మణ్ తన ఇంట్లో పెట్టుకొని రూ.350 చొప్పున అమ్మకాలు చేపడుతున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. డాక్టర్ చీటితో మాత్రమే అమ్మకాలు జరపాల్సిన ఈ మందును కొందరు గుట్టుగా కొనుగోలు చేసి, రహస్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అయితే, మాదక ద్రవ్యాలకు డిమాండ్‌తో పాటు ధర కూడా అధికంగా ఉండడంతో మత్తుకు బానిసగా మారిన కొందరు తక్కువ ధరకు లభిస్తున్న నిషేధిత దగ్గు మందును వినియోగించి మత్తులో తేలుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని విరివిగా విక్రయిస్తున్న మెడికల్‌హాల్స్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ సీఐ బాలరాజు డ్రగ్స్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News