Share News

Hyderabad: ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదన్నందుకు..

ABN , Publish Date - Sep 06 , 2025 | 07:45 AM

‘నా సెల్‌ స్విచ్చాఫ్‌ అయ్యింది. మీ సెల్‌ ఇస్తే కాల్‌ చేసుకొని ఇస్తానన్నాడు. ఎదుటి వ్యక్తి నుంచి బ్యాలెన్స్‌ లేదని సమాధానం రావడంతో చేయి చేసుకున్నాడు. తండ్రి, ఇద్దరు కలిసి యువకుడిపై ప్రతిదాడి చేయగా మృతిచెందాడు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు నంబరు 14కు చెందిన శ్రీధర్‌(30) ఈవెంట్స్‌లో లేబర్‌గా పనిచేస్తున్నాడు.

Hyderabad: ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదన్నందుకు..

- ముగ్గురు కలిసి ప్రతి దాడి చేయగా యువకుడి మృతి

హైదరాబాద: ‘నా సెల్‌ స్విచ్చాఫ్‌ అయ్యింది. మీ సెల్‌ ఇస్తే కాల్‌ చేసుకొని ఇస్తానన్నాడు. ఎదుటి వ్యక్తి నుంచి బ్యాలెన్స్‌ లేదని సమాధానం రావడంతో చేయి చేసుకున్నాడు. తండ్రి, ఇద్దరు కలిసి యువకుడిపై ప్రతిదాడి చేయగా మృతిచెందాడు. బంజారాహిల్స్‌ పోలీసుల(Banjara Hills Police) కథనం ప్రకారం.. రోడ్డు నంబరు 14కు చెందిన శ్రీధర్‌(30) ఈవెంట్స్‌లో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న తన వద్దకు స్నేహితుడు రావడంతో అతడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని రోడ్డునంబరు 2లోని బస్టాపులో దించేశాడు.


తిరుగు ప్రయాణంలో రోడ్డు నంబరు 14 ఆశా హాస్పిటల్‌ వద్దకు చేరుకున్నాడు. ఇంతలో తన సెల్‌ స్విచ్చాఫ్‌ కావడాన్ని గుర్తించి ఆసుపత్రి వాచ్‌మన్‌ వెంకటయ్యను ఫోన్‌ అడిగాడు. తన ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదని వెంకటయ్య చెప్పాడు. దీంతో శ్రీధర్‌ ఫోన్‌ ఇవ్వడం ఇష్టం లేక అబద్దం చెబుతావా అంటూ అడిగాడు. మాటమాటా పెరుగగా వెంకటయ్య పై శ్రీధర్‌(Sridhar) చేయిచేసుకున్నాడు. వెంటనే వాచ్‌మన్‌ తన కుమారులు హరికృష్ణ, తరుణ్‌లను పిలిచాడు.


city3.2.jpg

ముగ్గురు కలిసి శ్రీధర్‌ను సెల్లార్‌లోకి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. దెబ్బలతో ఇంటికి వచ్చిన శ్రీధర్‌ స్పృహ కోల్పోయాడు. అతడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే శ్రీధర్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2025 | 07:45 AM