Share News

Hyderabad: కుమారుడి మృతి కృంగదీసింది...

ABN , Publish Date - Nov 18 , 2025 | 07:06 AM

క్యాన్సర్‌ వల్ల కుమారుడు చనిపోగా ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆపై మద్యానికి బానిసయ్యాడు. ఆఖరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువుచాలించాడు. ఈ సంఘటన సంజీవయ్యనగర్‌లో జరిగింది.

Hyderabad: కుమారుడి మృతి కృంగదీసింది...

- మనోవేదనతో మద్యానికి బానిసై.. ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య

బర్కత్‌పుర(హైదరాబాద్): క్యాన్సర్‌ వల్ల కుమారుడు చనిపోగా ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆపై మద్యానికి బానిసయ్యాడు. ఆఖరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువుచాలించాడు. ఈ సంఘటన సంజీవయ్యనగర్‌(Sanjeevaiahnagar)లో జరిగింది. కాచిగూడ పీఎస్‌ అడ్మిని ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవయ్యనగర్‌లో నివాసం ఉంటున్న పకీర కుమారుడు జె. నరేష్‌(32) ఒక ఆటోడ్రైవర్‌. అతనికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గత డిసెంబర్‌లో కుమారుడు క్యాన్సర్‌తో మృతిచెందాడు.


city2.2.jpg

అప్పటి నుంచి లోలోన తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో నరేష్‌ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య శిరీష పుట్టింటికి వెళ్లి వచ్చేలోపు ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

పసిడి దిగుమతులు మూడింతలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 18 , 2025 | 07:06 AM