Hyderabad: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:58 AM
బంతి కోసం వెళ్లి గూడ్స్ ట్రాలీ వాహనం కింద పడి 13 నెలల బాలుడు కన్నుమూశాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన కల్లెం నరేష్, వాణి దంపతులు 10 ఏళ్ల క్రితం వలస వచ్చి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో ఉన్న లష్కర్‌గూడ రోడ్డులో నివాసం ఉంటున్నారు. నరేష్ ఒక గూడ్స్ ట్రాలీ డ్రైవర్.
- తండ్రి వాహనం కింద నలిగిన పసిప్రాణం
- గూడ్స్ ట్రాలీ కింద పడి 13 నెలల బాలుడి మృతి
హైదరాబాద్: బంతి కోసం వెళ్లి గూడ్స్ ట్రాలీ వాహనం కింద పడి 13 నెలల బాలుడు కన్నుమూశాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్స్టేషన్(Abdullapurmet Police Station) పరిధిలో సోమవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా రామన్నపేటకు చెందిన కల్లెం నరేష్, వాణి దంపతులు 10 ఏళ్ల క్రితం వలస వచ్చి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో ఉన్న లష్కర్‌గూడ రోడ్డులో నివాసం ఉంటున్నారు. నరేష్ ఒక గూడ్స్ ట్రాలీ డ్రైవర్.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడికి (3), చిన్న కుమారుడు లోహిత్(13 నెలలు). ఉదయం ఇంటి ఎదుట పార్కు చేసిన వాహనాన్ని నరేష్ రివర్స్ తీస్తుండగా బంతితో ఆడుకుంటూ లోహిత్ వెనుక నుంచి ట్రాలీ కిందకు వెళ్లాడు. గమనించని తండ్రి వాహనాన్ని పోన్విడంతో ఎడమ టైర్లు లోహిత్ తలపై ఎక్కి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే బాలుడు మృతిచెందారు. కళ్ల ఎదుటే కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News