Hyderabad: విశాఖ టు న్యూఢిల్లీ.. వయా సికింద్రాబాద్.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:53 AM
గంజాయి సరుకుతో రైల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గురువారం సికింద్రా బాద్ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌తో కలిసి వెల్లడించారు.
- గంజాయి సరఫరా
-17 కిలోల సరుకు పట్టివేత
- ఇద్దరి అరెస్ట్.. పరారీలో మరొకరు
సికింద్రాబాద్: గంజాయి సరుకుతో రైల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గురువారం సికింద్రా బాద్ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌తో కలిసి వెల్లడించారు. న్యూఢిల్లీ మదన్‌పూర్ ఖదార్ ప్రాంతానికి చెందిన చంద్రప్రకాశ్(22), అదే ప్రాంతానికి చెందిన జామిలా ఖాతూన్(19) స్నేహితులు.
చంద్రప్రకాశ్‌కు ఫేస్‌బుక్‌లో పరన్‌ఖాన్ పరిచయమయ్యాడు. అతని వద్ద గంజాయి ఉందని చెప్పడంతో చంద్రప్రకాశ్ కొనేందుకు ఒప్పుకొన్నాడు. ఈనెల 10న చంద్రప్రకాశ్, జామిలా ఖాతూన్ ఇద్దరు కలిసి విజయనగరానికి వెళ్లారు. ఒప్పందం ప్రకారం పరన్‌ఖాన్ 17 కిలోల గంజాయిని వారికి అప్పగించాడు. అదే రోజు మధ్యాహ్నం విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు(Visakhapatnam Express train) ఎక్కి ఈ నెల 11న ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగారు.

న్యూఢిల్లీకి రైలులో వెళ్లేందుకు ఇద్దరు గంజాయి సరుకుతో వెయింటింగ్ హాలులో కూర్చున్నారు. వీరిని సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ సీఐ సరస్వత్, జీఆర్పీ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా బ్యాగులో రూ.8.48 లక్షల విలువ చేసే 17 కిలోల గంజాయి సరుకు లభించింది. గంజాయి, రెండు సెల్‌పోన్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరాన్ ఖాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News