Share News

Hyderabad: అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది

ABN , Publish Date - Oct 31 , 2025 | 10:01 AM

అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. డ్యూటీకి వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువకుడు అరగంటలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది

- బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన స్పోర్ట్స్‌ బైకు

- తలపగిలి యువకుడి మృతి

హైదరాబాద్: అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. డ్యూటీకి వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువకుడు అరగంటలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓల్డుబోయినపల్లి మైత్రీవనం కాలనీ(Old Boyanapalli Maitrivanam Colony)కి చెందిన విష్ణుమిలకల రోహన్‌దేవ్‌ (21) మాదాపూర్‌లోని కాన్సియంట్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం డ్యూటీకి టీజీ08ఎల్‌వో0770 స్పోర్ట్స్‌ బైకుపై ఇంటినుంచి బయలు దేరాడు.


city3.2.jpg

మితిమీరిన వేగంతో వెళుతున్న అతడు బాలానగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు. తల బలంగా ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న బాలానగర్‌ పోలీసులు(Balanagar Police) మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు రాజీవ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2025 | 10:01 AM