Hyderabad: అమ్మో.. రూ.21.93 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:53 AM
నకిలీ ట్రేడింగ్ యాప్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.21.93 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రచారం చేశారు.
- బ్యాంకు ఖాతాలు సమకూర్చిన ఇద్దరి అరెస్టు
హైదరాబాద్ సిటీ: నకిలీ ట్రేడింగ్ యాప్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.21.93 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రచారం చేశారు. దీనికి ఆకర్షితుడై నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి పెట్టుబడి పెట్టాడు. లాభాలతో వచ్చిన రూ.21,93,300 డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించగా, సిబిల్ స్కోర్ బాగా లేదని, అందుకోసం రూ.15లక్షలు చెల్లించారని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. లేకుంటే చట్టబద్ధతను ప్రశ్నించడంతో పాటు మీపై ఫిర్యాదు చేస్తామని బెదిరించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాళ్లు ఒక బ్యాంకు అకౌంట్‌కు పంపిన రూ.90వేల లావాదేవీని పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో బ్యాంకు ఖాతాలను అందించడంలో భాగస్వాములైన ఇద్దరు నిందితులైన తుమ్మలూరు సుధాకర్‌రెడ్డి(Thummaluru Sudhakar Reddy), తుమ్మలూరు రఘునాథరెడ్డిలను అరెస్టు చేశామని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ కేసుతో పాటు మరో ట్రేడింగ్ ఫ్రాడ్, స్మిషింగ్ ఫ్రాడ్ కేసుల్లో మరో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
Read Latest Telangana News and National News