Share News

Hyderabad: రివార్డు పాయింట్స్‌ పేరుతో బురిడీ కొట్టించి..

ABN , Publish Date - Jun 28 , 2025 | 07:18 AM

ఇండియన్‌ ఆయిల్‌ రివార్డు పాయింట్స్‌ పేరుతో నగరానికి చెందిన వృద్ధుడిని సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ.1.28 లక్షలు కొల్లగొట్టారు.

Hyderabad: రివార్డు పాయింట్స్‌  పేరుతో బురిడీ కొట్టించి..

- రూ.1.28 లక్షలు కొట్టేసిన నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఇండియన్‌ ఆయిల్‌ రివార్డు పాయింట్స్‌ పేరుతో నగరానికి చెందిన వృద్ధుడిని సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అతడి క్రెడిట్‌ కార్డు(Credit card) నుంచి రూ.1.28 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌(Secunderabad)కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి ఓ నంబర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘మీకు ఇండియన్‌ ఆయిల్‌ నుంచి రివార్డు పాయింట్స్‌ ఉన్నా యి. గడువు ముగిసిపోతుంది. వెంటనే క్రెడిట్‌ చేసుకోండి’ అని దాని సారాంశం. ఓ లింకు కూడా పంపారు.


city2.2.jpg

బాధితుడు లింక్‌పై క్లిక్‌ చేశాడు. అందులో రూ.10 వేల విలువ చేసే అమెజాన్‌ ఓచర్‌ను రూ.399కే విక్రయిస్తున్నట్లు ఉంది. బాధితుడు దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధపడగా హెచ్‌ఎస్బీసీ క్రెడిట్‌ కార్డు సర్వీస్‌ పేరుతో ఓటీపీ వచ్చింది. వెంటనే ఒకరు ఫోన్‌ చేసి ఓటీపీ(OTP) చెప్పాలని కోరగా, తాను కొనుగోలు చేస్తున్న ఓచర్‌కు సంబంధించి అయి ఉంటుందని ఓటీపీని షేర్‌ చేశాడు. వెంటనే రూ.1,28,969.33 వినియోగించారని మెసేజ్‌ వచ్చింది. కంగుతిన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం

ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 28 , 2025 | 07:18 AM